ABHISHEK SHARMA:దాయాదితో సమరానికి అభిషేక్ సిద్ధం..!

అభిషేక్ ఆరోగ్యం మెరుగవుతుందన్న బీసీసీఐ

Update: 2026-02-13 04:45 GMT

అభిషేక్‌ ఏ దశలోనూ అతను దూకుడు తగ్గించడు. ప్రత్యర్థి జట్లకు ఊపిరి సలపనివ్వకుండా షాట్లు కొడుతూనే ఉంటాడు. ఇలా కొన్ని మ్యాచ్‌ల్లో తన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆరంభంలోనే మ్యాచ్‌ ఫలితాలను నిర్దేశిస్తున్నాడు. కానీ ఒక మ్యాచ్‌ చెలరేగితే.. ఇంకో మ్యాచ్‌లో వెంటనే ఔటవుతున్నాడు. చివరి అయిదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు తొలి బంతికే వికెట్‌ సమర్పించుకున్నాడు అభిషేక్‌. గత నెల న్యూజిలాండ్‌తో తొలి టీ20 35 బంతుల్లోనే 84 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో టీ20లో 155 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 10 ఓవర్లకే ఛేదించిందంటే అందుకు ప్రధాన కారణం ఈ కుర్రాడే. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లోనే 68 పరుగులు కొట్టేశాడు. నేడు నమీ­బి­యా­తో టీ­మిం­డి­యా తల­ప­డ­నుం­ది. అయి­తే.. ఈ మ్యా­చ్‌­లో ఇప్ప­టి­కే స్టా­ర్ బ్యా­ట్స్ మెన్ అభి­షే­క్ శర్మ దూ­ర­మ­య్యా­డు.

పా­కి­స్థా­న్‌­తో మ్యా­చ్‌­కు వె­ళ్లే ముం­దు ఫి­ట్‌­నె­స్ పు­న­రు­ద్ధ­ర­ణ­పై దృ­ష్టి పె­ట్ట­ను­న్నా­డు అభి­షే­క్. ప్ర­స్తుత పరి­స్థి­తు­లు దృ­ష్ట్యా అభి­షే­క్ పా­కి­స్థా­న్‌­తో మ్యా­చ్ ఆడా­ల­ని, అం­దు­కో­సం ఫి­ట్‌­గా ఉం­డా­ల­ని తా­ప­త్ర­య­ప­డు­తు­న్నా­డు. అటు జట్టు యా­జ­మా­న్యం ని­ర్ణ­యం, ఇటు అభి­షే­క్ పట్టు­దల చూ­స్తుం­టే దా­దా­పు పా­క్‌ మ్యా­చ్‌­లో ఉండే అవ­కా­శం ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఆరో­గ్యం మె­రు­గు­ప­డు­తు­న్నా.. పూ­ర్తి స్థా­యి ఫి­ట్‌­గా లేడట. కొంత రె­స్ట్ అవ­స­ర­మ­ని వై­ద్యు­లు చె­ప్పి­న­ట్లు తె­లు­స్తోం­ది. అం­దు­కో­స­మే బు­ధ­వా­రం జట్టు ప్రా­క్టీ­స్ సె­ష­న్‌­కూ హా­జ­రు కా­లే­దు. ప్ర­స్తు­తం తన ఆరో­గ్యం త్వ­ర­గా కు­దు­ట­ప­డేం­దు­కు అభి­షే­క్ తన వ్య­క్తి­గత ట్రై­న­ర్‌­ను ఢి­ల్లీ­కి పి­లి­పిం­చు­కు­న్నా­డ­ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌పై సక్లయిన్ ముస్తాక్ అక్కసు

టీ20 వర­ల్డ్‌­క­ప్‌ 2026లో భా­గం­గా ఆది­వా­రం కొ­లం­బో­లో­ని ప్రే­మ­దాస స్టే­డి­యం వే­ది­క­గా భా­ర­త్‌, పాక్ మ్యా­చ్‌ జర­గ­నుం­ది. దీ­ని­పై పా­కి­స్థా­న్‌ మాజీ క్రి­కె­ట­ర్‌ సక్ల­యి­న్‌ ము­స్తా­క్‌ వి­వా­దా­స్పద వ్యా­ఖ్య­లు చే­శా­డు. ఐసీ­సీ­ని బీ­సీ­సీఐ ప్ర­భా­వి­తం చే­స్తుం­ద­న్నా­డు. ప్ర­స్తు­త­ము­న్న సాం­కే­తిక పరి­జ్ఞా­నం­తో కొ­లం­బో­లో­ని పి­చ్‌­ను ఎప్పు­డై­నా మా­ర్చొ­చ్చ­ని ని­రా­ధార ఆరో­ప­ణ­లు చే­స్తూ.. తన అక్క­సు వె­ల్ల­గ­క్కా­డు. ‘ఐసీ­సీ ఎవరి ఒత్తి­డి­కి తలొ­గ్గి పని­చే­స్తుం­దో మనం­ద­రి­కీ తె­లు­సు. ప్ర­స్తుత ఆధు­నిక కా­లం­లో ఎలాం­టి సాం­కే­తిక పరి­జ్ఞా­నం ఉం­దం­టే.. దాని సా­యం­తో మనకు తె­లి­య­కుం­డా­నే గ్రౌం­డ్స్‌­మె­న్‌ ఎప్పు­డై­నా పి­చ్‌­ను మా­ర్చొ­చ్చు’ అని సక్ల­యి­న్‌ ము­స్తా­క్‌ అన్నా­డు. అలా­గే అతడు బౌ­లిం­గ్‌ ఆర్డ­ర్ గు­రిం­చి మా­ట్లా­డా­డు. ‘భా­ర­త్‌­తో మ్యా­చ్‌­కు ముం­దు ఉస్మా­న్‌ తా­రి­క్‌ ఆత్మ­వి­శ్వా­సా­న్ని పొం­దా­డు. కానీ మీకు ఇద్ద­రు పే­స­ర్లు, ఒక ఆల్‌­రౌం­డ­ర్‌ అవ­స­ర­మై­తే మొ­త్తం సమీ­క­ర­ణం మా­రి­పో­తుం­ది. జి­మ్మీ నీ­ష­మ్‌­ను చూ­డం­డి. అతడు ఫహీ­మ్ అష్ర­ఫ్ లాం­టి­వా­డు. పా­కి­స్థా­న్ తర­పున 20వ ఓవర్ ఎవరు వే­స్తా­రు? తా­రి­క్? నవా­జ్? షా­దా­బ్? అబ్రా­ర్? వారు చి­వ­రి­గా ఎప్పు­డు 20వ ఓవ­ర్‌ వే­శా­రు. ఫహీ­మ్ 20వ ఓవ­ర్‌ వే­య­గ­ల­డో.. లేదో..’ అని సక్ల­యి­న్‌ ముస్తాక్ వి­శ్లే­షిం­చా­డు.

Tags:    

Similar News