ABHISHEK: షేక్ చేస్తాడునుకుంటే.. షేక్ అవుతున్నాడే

మహా సమరంలో అభిషేక్ డకౌట్లు... వరుసగా మూడో మ్యాచులో డకౌట్...సున్నా దాటని అభిషేక్ బ్యాటింగ్...షేక్ పై అంచనాలన్నీ తలకిందులు

Update: 2026-02-20 04:30 GMT

ఒక­సా­రి డకౌ­టై­తే అది యా­దృ­చ్ఛి­కం అను­కో­వ­చ్చు. రెం­డో­సా­రి డకౌ­టై­తే అది ఒత్తి­డి అను­కో­వ­చ్చు. కానీ వరు­స­గా మూ­డో­సా­రి కూడా అదే పరి­స్థి­తి ఎదు­రై­తే మా­త్రం అది ఆం­దో­ళ­న­క­ర­మే. టీ20 ప్ర­పం­చ­క­ప్‌ వంటి అత్యంత కీలక టో­ర్నీ­లో భారత జట్టు ఓపె­న­ర్‌ అభి­షే­క్‌ శర్మ ప్ర­ద­ర్శన ఇప్పు­డు అభి­మా­ను­ల్లో ఇదే చర్చ­కు దా­రి­తీ­స్తోం­ది. భారీ అం­చ­నాల మధ్య ప్ర­పం­చ­క­ప్‌­లో అడు­గు­పె­ట్టిన ఈ యువ బ్యా­ట­ర్‌ గ్రూ­ప్‌ దశను ఒక్క పరు­గూ చే­య­కుం­డా ము­గిం­చ­డం అనూ­హ్య పరి­ణా­మం­గా మా­రిం­ది. టో­ర్నీ ప్రా­రం­భా­ని­కి ముం­దు పరి­స్థి­తి పూ­ర్తి­గా భి­న్నం­గా ఉం­డే­ది. వి­రా­ట్‌ కో­హ్లి లేని లో­టు­ను భర్తీ చేసే బా­ధ్య­త­ను అభి­షే­క్‌ భు­జా­ల­పై పె­ట్టా­రు. దూ­కు­డైన ఆట­శై­లి­తో పవ­ర్‌­ప్లే­లో­నే మ్యా­చ్‌ తే­ల్చ­గల సా­మ­ర్థ్యం అత­ని­కి ఉం­ద­ని వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డ్డా­రు. ప్ర­త్య­ర్థి జట్ల­కు అతనే ప్ర­ధాన ము­ప్పు అవు­తా­డ­ని అం­చ­నా­లు వ్య­క్త­మ­య్యా­యి. ము­ఖ్యం­గా పా­కి­స్థా­న్‌­తో జరి­గే హై­ప్రొ­ఫై­ల్‌ పో­రు­లో అతని పా­త్ర కీ­ల­క­మ­ని భా­విం­చా­రు. కానీ అం­చ­నా­లు ఎంత ఎత్తు­లో ఉన్నా­యో, ఫలి­తం అం­త­కం­త­కూ ని­రాశ కలి­గిం­చే­లా మా­రిం­ది.

గ్రూ­ప్‌ దశలో భా­ర­త్‌ ఆడిన మూడు మ్యా­చ్‌­ల్లో అభి­షే­క్‌ బ్యా­టిం­గ్‌­కు ది­గి­నా ఒక్క­టం­టే ఒక్క పరు­గూ చే­య­లే­క­పో­యా­డు. పా­కి­స్థా­న్‌, అమె­రి­కా, నె­ద­ర్లాం­డ్స్‌ వంటి జట్ల­పై కూడా ఖాతా తె­ర­వ­లే­క­పో­వ­డం ఆశ్చ­ర్య­క­రం­గా మా­రిం­ది. అం­త­ర్జా­తీయ స్థా­యి­లో, ము­ఖ్యం­గా ప్ర­పం­చ­క­ప్‌ వే­ది­క­పై ఇలా వరు­స­గా మూడు డకౌ­ట్లు నమో­దు చే­య­డం అరు­దైన సం­ఘ­టన. ఈ చె­త్త రి­కా­ర్డు అతని పే­రిట ని­లి­చి­పో­యే అవ­కా­శ­ముం­ద­న్న చర్చ కూడా మొ­ద­లైం­ది. నమీ­బి­యా­తో జరి­గిన ఒక మ్యా­చ్‌­లో అనా­రో­గ్యం కా­ర­ణం­గా అతను ఆడ­లే­దు. అయి­తే మి­గి­లిన మూడు మ్యా­చ్‌­ల్లో­నూ అతని ఆటలో ఒకే వి­ధ­మైన లోపం కని­పిం­చిం­ది. సహజంగా అతని ఆటశైలి దూకుడే అయినప్పటికీ, క్రీజులో కుదురుకునే వరకు ఓర్పు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని సూచించారు. మొదట కొన్ని బంతులు ఆచితూచి ఆడి, తర్వాత దాడి ప్రారంభిస్తే మంచిదని చెప్పారు. అయితే అభిషేక్‌ మాత్రం తన సహజ శైలిని మార్చేందుకు ప్రయత్నించలేదు.

లోపిస్తున్న సహనం

ప్ర­త్యే­కం­గా రెం­డు డా­ట్‌­బా­ల్స్‌ పడ­గా­నే అతను ఆతు­ర­త­కు లో­న­వు­తు­న్న­ట్లు కని­పిం­చిం­ది. బౌ­ల­ర్ల­ను తక్కువ అం­చ­నా వేసి, బంతి నా­ణ్య­త­ను గమ­నిం­చ­కుం­డా అడ్డ­ది­డ్డం­గా షా­ట్లు ఆడే ప్ర­య­త్నం చే­శా­డు. ఫలి­తం­గా పా­కి­స్థా­న్‌, నె­ద­ర్లాం­డ్స్‌ మ్యా­చ్‌­ల్లో వి­కె­ట్‌ కో­ల్పో­యా­డు. సిం­గి­ల్‌ తీ­సు­కు­ని స్ట్రై­క్‌ రొ­టే­ట్‌ చే­యా­ల­ని సు­నీ­ల్‌ గా­వ­స్క­ర్‌ వంటి ది­గ్గ­జా­లు సూ­చిం­చి­నా, ఆ సూ­చ­న­ల­ను అమలు చే­య­లే­క­పో­యా­డు. అతని లో­ప­లి వి­ధ్వం­సక బ్యా­ట­ర్‌ అహం, ఓర్పు­ను దె­బ్బ­తీ­స్తోం­ద­న్న అభి­ప్రా­యం వ్య­క్త­మ­వు­తోం­ది. టో­ర్నీ­కి ముం­దు అత­ని­పై ఉన్న అం­చ­నా­లు ఇప్పు­డు పూ­ర్తి­గా తల­కిం­దు­ల­య్యా­యి. ప్ర­త్య­ర్థి బౌ­ల­ర్ల­ను షే­క్‌ చే­స్తా­డ­ను­కు­న్న ఓపె­న­ర్‌ ఇప్పు­డు ఒత్తి­డి­తో తానే షే­క్‌ అయి­న­ట్లు కని­పి­స్తు­న్నా­డు. వరుస వై­ఫ­ల్యా­లు ఒక ఆట­గా­డి ఆత్మ­వి­శ్వా­సా­న్ని దె­బ్బ­తీ­స్తా­యి. ము­ఖ్యం­గా ప్ర­పం­చ­క­ప్‌ వంటి పె­ద్ద వే­ది­క­పై ఆ ఒత్తి­డి మరింత పె­రు­గు­తుం­ది. ఈ స్థి­తి­లో మా­న­సి­కం­గా బలం­గా ఉం­డ­టం అత్యంత అవ­స­రం. మరి సూ­ప­ర్ 8 సమ­రం­లో అభి­షే­క్ తన పంథా మా­రు­స్తా­డే­మో చూ­డా­లి.

Tags:    

Similar News