AFG: క్రికెటర్ల మరణంపై భగ్గుమన్న క్రీడా ప్రపంచం

పాక్‌ -అప్ఘాన్ బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్... దాడుల్లో ముగ్గురు అప్ఘన్ క్రికెటర్ల మృతి.. ట్రై సిరీస్ నుంచి వైదొలిగిన అఫ్గాన్

Update: 2025-10-19 03:30 GMT

పా­కి­స్తా­న్ వై­మా­నిక దా­డు­లు ఆఫ్ఘ­న్ క్రి­కె­ట్‌­లో తీ­వ్ర వి­షా­దా­న్ని నిం­పా­యి. పా­క్టి­కా ప్రా­వి­న్స్‌­లో జరి­గిన ఈ దా­డి­లో ము­గ్గు­రు స్థా­నిక క్ల­బ్ క్రి­కె­ట­ర్ల­తో సహా ఐదు­గు­రు మర­ణిం­చా­రు. క్రి­కె­ట­ర్లు కబీ­ర్, సి­బ్ఘ­తు­ల్లా, హరూ­న్ మర­ణిం­చ­గా.. మరో నలు­గు­రు గా­య­ప­డ్డా­రు. ప్రా­వి­న్షి­య­ల్ రా­జ­ధా­ని షరా­నా­లో జరి­గిన స్థా­నిక టో­ర్న­మెం­ట్ నుం­డి ఆట­గా­ళ్లు అర్గు­న్ జి­ల్లా­కు తి­రి­గి వస్తుం­డ­గా ఈ దు­ర్ఘ­టన జరి­గిం­ది. ఈ ఘట­న­పై ఆఫ్ఘ­ని­స్తా­న్ క్రి­కె­ట్ బో­ర్డు తీ­వ్ర వి­చా­రం వ్య­క్తం చే­సిం­ది. రణిం­చిన ఆట­గా­ళ్ల­ను ఆఫ్ఘ­న్ క్రి­కె­ట్ యొ­క్క గ్రా­స్‌­రూ­ట్ హీ­రో­లు­గా అభి­వ­ర్ణిం­చిం­ది. పా­క్టి­కా వై­మా­నిక దా­డు­ల్లో దే­శీయ ఆట­గా­ళ్లు మర­ణిం­చిన నే­ప­థ్యం­లో ఆఫ్ఘ­ని­స్తా­న్ క్రి­కె­ట్ బో­ర్డు కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. నవం­బ­ర్‌­లో జర­గా­ల్సిన పా­కి­స్తా­న్, శ్రీ­లం­క­తో కూ­డిన ము­క్కో­ణ­పు T20 సి­రీ­స్‌­లో పా­ల్గొ­న­కూ­డ­ద­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఆట­గా­ళ్ల మర­ణాల పట్ల ని­ర­స­న­గా, జా­తీయ గౌ­ర­వా­న్ని దృ­ష్టి­లో ఉం­చు­కు­ని ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది.

ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ల ఆగ్రహం

ఈ దా­డి­ని ఆఫ్ఘ­ని­స్తా­న్ స్టా­ర్ క్రి­కె­ట­ర్లు తీ­వ్రం­గా ఖం­డిం­చా­రు. రషీ­ద్ ఖాన్ ట్వి­ట్ట­ర్‌­లో స్పం­ది­స్తూ.. “ఇటీ­వల ఆఫ్ఘ­ని­స్తా­న్‌­పై పా­కి­స్తా­న్ వై­మా­నిక దా­డు­ల్లో పౌ­రు­లు మర­ణిం­చ­డం నాకు చాలా బాధ కలి­గిం­చిం­ది. ప్ర­పంచ వే­ది­క­పై తమ దే­శా­ని­కి ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­ల­ని కలలు కన్న మహి­ళ­లు, పి­ల్ల­లు, యువ క్రి­కె­ట­ర్ల ప్రా­ణా­ల­ను బలి­గొ­న్న వి­షా­దం ఇది. పౌ­రు­ల­ను లక్ష్యం­గా చే­సు­కో­వ­డం పూ­ర్తి­గా అనా­గ­రి­కం. పా­కి­స్తా­న్‌­తో జర­గ­బో­యే మ్యా­చ్‌ల నుం­డి వై­దొ­ల­గా­ల­ని ACB తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­న్ని నేను స్వా­గ­తి­స్తు­న్నా­ను. దే­శ­మే అన్నిం­టి­కం­టే ము­ఖ్యం ” అని రా­సు­కొ­చ్చా­రు. “పక్తి­కా ప్రా­వి­న్స్‌­లో­ని ఉర్గు­న్‌ జి­ల్లా చెం­దిన ము­గ్గు­రు ఆట­గా­ళ్ల­ను పా­కి­స్తా­న్‌ సై­న్యం అమా­ను­షం­గా లక్ష్యం­గా చే­సు­కుం­ది. ఈ భయం­క­ర­మైన దా­డి­పై మా బో­ర్డు తీ­వ్ర వి­చా­రం వ్య­క్తం చే­స్తోం­ది. అప్ఘ­న్‌ క్రీ­డా వర్గా­ల­కు, ఆట­గా­ళ్ల­కు ఇది తీ­వ్ర­మైన నష్టం. వీ­రం­తా దేశ గౌ­ర­వం కోసం ప్రా­ణా­ల­ను అర్పిం­చా­రు. వీరి కు­టుం­బా­ల­కు, పక్తి­కా ప్ర­జ­ల­కు మా సా­ను­భూ­తి తె­లి­య­జే­స్తు­న్నాం” అని ఏసీ­బీ తన అధి­కా­రిక ప్ర­క­ట­న­లో పే­ర్కొం­ది. ప్రా­ణా­లు కో­ల్పో­యిన ఆట­గా­ళ్ల­ను కబీ­ర్‌, సి­బ్ఘ­తు­ల్లా, హరూ­న్‌­గా గు­ర్తిం­చా­రు. వీ­రి­తో పాటు మరో ఐదు­గు­రు స్థా­ని­కు­లు కూడా మృతి చెం­ద­గా, ఏడు­గు­రి­కి గా­యా­ల­య్యా­యి. దాం­తో నవం­బ­ర్‌­లో జర­గా­ల్సిన ట్రై టీ20 సి­రీ­స్‌­లో పా­ల్గొ­న­బో­మ­ని బో­ర్డు ప్ర­క­టిం­చిం­ది. పా­కి­స్తా­న్‌ ఆతి­థ్యం ఇవ్వా­ల్సి ఉం­డ­గా శ్రీ­లంక మూడో జట్టు­గా ఉంది.

Tags:    

Similar News