MARY KOM: ‘జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు అఫైర్’

మాజీ భర్త కరుం­గ్‌ ఆం­ఖో­ల­ర్‌ సంచలన వ్యాఖ్యలు

Update: 2026-01-13 11:45 GMT

తనను మోసం చేసి ఆస్తు­లు లా­క్కు­న్నా­ర­న్న భారత బా­క్సిం­గ్ లె­జెం­డ్ మేరీ కోమ్ ఆరో­ప­ణ­ల్లో­ని­జం లే­ద­ని ఆమె మాజీ భర్త కరుం­గ్‌ ఆం­ఖో­ల­ర్‌ అన్నా­రు. ‘ఆమె­కు జూ­ని­య­ర్ బా­క్స­ర్‌­తో వి­వా­హే­తర సం­బం­ధం ఉం­డే­ది. ఫ్యా­మి­లీ సర్ది­చె­ప్పి­నా మళ్లీ మరో వ్య­క్తి­తో అఫై­ర్ పె­ట్టు­కుం­ది. అం­దు­కు నా దగ్గర వా­ట్సా­ప్ మె­సే­జ్ ప్రూ­ఫ్‌­లు కూడా ఉన్నా­యి. ఒం­ట­రి­గా ఉంటూ అక్రమ సం­బం­ధా­లు నడి­పిం­చా­ల­ను­కుం­ది. అం­దు­కే వి­డా­కు­లు తీ­సు­కుం­ది’ అని ఓ మీ­డి­యా సం­స్థ­తో పే­ర్కొ­న్నా­రు. మేరీ కోమ్ ఇటీ­వల తన భర్త­తో వి­డా­కు­లు తీ­సు­కు­న్న వి­ష­యం తె­లి­సిం­దే. అయి­తే ఆమె వి­డా­కు­లు  తీ­సు­కో­వ­డం­పై అనేక వా­ర్త­లు సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్ అయ్యా­యి ఈ క్ర­మం­లో మేరీ కోమ్ స్పం­ది­స్తూ.. తన వి­డా­కు­ల­పై సం­చ­లన వి­ష­యా­ల­ను బయ­ట­పె­ట్టా­రు. తన భర్త ఆన్ల­ర్ (ఓం­కో­ల­ర్) తనను ఆర్థి­కం­గా దా­రు­ణం­గా మోసం చే­శా­ర­ని, తన కష్టా­ర్జి­తం­తో కొ­న్న ఆస్తు­ల­ను ఆమె­కు తె­లి­య­కుం­డా తన పేరు మీ­ద­కు మా­ర్చు­కు­న్నా­ర­ని మేరీ కోమ్ ఆరో­పిం­చా­రు. ఆస్తు­ల­ను తనఖా పె­ట్టి ఆన్ల­ర్ భా­రీ­గా అప్పు­లు చే­శా­ర­ని, దీ­ని­వ­ల్ల తాను తీ­వ్ర­మైన ఆర్థిక ఇబ్బం­దు­ల్లో కూ­రు­కు­పో­యా­న­ని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. 2022 కా­మ­న్వె­ల్త్ గే­మ్స్ సమ­యం­లో గా­య­ప­డి మం­చా­ని­కే పరి­మి­త­మై­న­ప్పు­డు, తన ఆర్థిక వ్య­వ­హా­రాల గు­రిం­చి ఆరా తీ­య­గా ఈ చేదు ని­జా­లు వె­లు­గు­లో­కి వచ్చా­య­ని ఆమె పే­ర్కొ­న్నా­రు. తన వ్య­క్తి­గత వి­ష­యా­లు రచ్చ­కె­క్క­కూ­డ­ద­ని ఇం­త­కా­లం మౌ­నం­గా ఉం­డ­టా­ని­కి కా­ర­ణ­మ­ని చె­ప్పు­కొ­చ్చా­రు.కానీ సో­ష­ల్ మీ­డి­యా­లో తన వ్య­క్తి­త్వం పై తప్పు­డు ప్ర­చా­రా­లు జరు­గు­తుం­డ­టం­తో ఇప్పు­డు నిజం చె­ప్పక తప్ప­లే­ద­ని మేరీ కోమ్ స్ప­ష్టం చే­శా­రు. ఈ ఆరో­ప­ణ­ల­ను ఆమె భర్త తా­జా­గా కొ­ట్టి­ప­డే­శా­రు. 

Tags:    

Similar News