KOHLI: లండన్‌కు మకాం మారుస్తున్న కోహ్లీ

కీలక వ్యాఖ్యలు చేసిన మాధురీ దీక్షిత్ భర్త;

Update: 2025-04-27 02:30 GMT

టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ నివాసాన్ని లండన్‌కు మార్చాలని యోచిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ తాజాగా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భర్త, డాక్టర్ శ్రీరామ్ నెనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ శ్రీరామ్ నెనే విరాట్- అనుష్క లండన్‌లో మకాం మార్చాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అనుష్కతో ఓసారి మాట్లాడినప్పుడు ఆసక్తికర విషయం చెప్పిందని... వారు లండన్‌కు మకాం మార్చాలని ఆలోచిస్తున్నారని శ్రీరామ్ వెల్లడించారు. భారత్‌లో తమ విజయాన్ని, పేరు ప్రఖ్యాతులను స్వేచ్ఛగా ఆస్వాదించలేకపోతున్నారని డాక్టర్ నెనే వెల్లడించారు. విరాట్, అనుష్క దంపతులు తమ పిల్లలను సాధారణ వాతావరణంలో పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీరామ్ ఇంకేమన్నారంటే...

" అనుష్క, కోహ్లీ ఇక్కడ ఏమి చేసినా అది అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. వారు తమ పిల్లలను కెమెరాలకు దూరంగా సాధారణంగా పెంచాలనుకుంటున్నారు. వారి నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఒక సెలబ్రిటీగా నా భార్య మాధురి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి అనుష్క, కోహ్లీ సరైన నిర్ణయమే తీసుకున్నారని అనుకుంటున్నా " అని శ్రీరామ్ పేర్కొన్నారు.

ఎక్కువగా లండన్‌లోనే...

గతేడాది కోహ్లీ తన భార్య, పిల్లలతో కలిసి లండన్‌లో తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే కొందరు సన్నిహితులు కూడా కోహ్లీ ఫ్యామిలీ లండన్‌లో నివసిస్తున్నట్టు ధ్రువీకరించారు. UK పౌరసత్వం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పిల్లలు పుట్టుకతో యూకే పౌరసత్వాన్ని పొందవచ్చు. కానీ, వారి తల్లిదండ్రులలో కనీసం ఒకరికి బ్రిటిష్ పౌరసత్వం ఉండాల్సి ఉంటుంది. ఇది కాకుండా, బ్రిటిష్ పౌరుడిని వివాహం చేసుకుంటే అక్కడి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సిటిజన్‌షిప్ సెటిల్‌మెంట్ స్కీమ్ కింద, స్థిరపడి ఉన్న వ్యక్తులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News