ASHWIN: ఇక నా దృష్టంతా క్రికెట్‌పైనే: అశ్విన్

బ్రెవిస్‌పై ఇష్యూపై మళ్లీ స్పందించిన అశ్విన్... అనుమాలన్నీ నివృత్తి అయ్యాయ్... చెన్నై రూల్స్ పాటించిందన్న అశ్విన్;

Update: 2025-08-18 07:00 GMT

ఐపీ­ఎ­ల్‌ 2025లో డె­వా­ల్డ్ బ్రె­వి­స్‌­‌­ను సీ­ఎ­స్కే తీ­సు­కో­వ­డం­పై అశ్వి­న్ చే­సిన వ్యా­ఖ్య­లు చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. ఇతర ఫ్రాం­ఛై­జీ­లు పో­టీ­ప­డి­నా.. సీ­ఎ­స్కే ఎక్కువ మొ­త్తం ఆఫర్ చేసి అత­డి­ని దక్కిం­చు­కుం­ద­ని అశ్వి­న్ ఇటీ­వల అన్నా­డు. అయి­తే దీ­ని­పై చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ ఫ్రాం­ఛై­జీ స్పం­దిం­చిం­ది. తాము ని­బం­ధ­న­లు పా­టిం­చే అత­డి­ని తీ­సు­కు­న్నా­మ­ని, ఇం­దు­లో ఎలాం­టి తప్పూ జర­గ­లే­ద­ని స్ప­ష్టం చే­సిం­ది. ఈ నే­ప­థ్యం­లో సీ­ఎ­స్కే ప్లే­య­ర్ రవి­చం­ద్ర­న్ అశ్వి­న్ మరో­సా­రి స్పం­దిం­చా­డు. రవి­చం­ద్ర­న్ అశ్వి­న్‌­కు యూ­ట్యూ­బ్ ఛా­నె­ల్ ఉంది. అం­దు­లో క్రీ­డా వి­ష­యా­ల­పై అతడు డి­బే­ట్‌­లు పె­డు­తుం­టా­డు. ఇటీ­వల డి­వా­ల్డ్ బ్రె­వి­స్ గు­రిం­చి మా­ట్లా­డా­డు. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ గా­య­ప­డ్డ గు­ర్జ­ప్‌­నీ­త్ సిం­గ్ ప్లే­సు­లో డె­వా­ల్డ్ బ్రె­వి­స్‌­ను తీ­సు­కుం­ది. అయి­తే ఇతర జట్లు పోటీ పడ్డ­ప్ప­టి­కీ ధర చూసి వె­న­క్కి తగ్గా­య­ని, సీ­ఎ­స్కే పట్టు­బ­ట్టి మరీ దక్కిం­చు­కుం­ద­ని అశ్వి­న్ అన్నా­డు. దీం­తో బ్రె­వి­స్‌­ను దక్కిం­చు­కు­నేం­దు­కు సీ­ఎ­స్కే అక్ర­మా­ల­కు పా­ల్ప­డిం­ద­నే ప్ర­చా­రం జరి­గిం­ది.

అసలు అశ్విన్‌ ఏమన్నాడంటే?

తన యూ­ట్యూ­బ్‌ ఛా­న­ల్‌­లో చాలా వి­ష­యా­ల­పై అశ్వి­న్ డి­బే­ట్లు పె­డు­తుం­టా­డు. ఇలా­గే సీ­ఎ­స్‌­కే గత ఐపీ­ఎ­ల్‌ సమ­యం­లో తీ­సు­కు­న్న ఓ ని­ర్ణ­యం­పై­నా ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­డు. సౌ­తా­ఫ్రి­కా ఆట­గా­డు బ్రె­వి­స్‌ బే­స్‌ ప్రై­స్ రూ. 75 లక్ష­లు. కానీ, అత­డి­ని రి­ప్లే­స్‌­మెం­ట్‌­గా రూ.2.2 కో­ట్లు చె­ల్లిం­చి చె­న్నై తీ­సు­కుం­ది. గు­ర్జ­ప్‌­నీ­త్‌ సిం­గ్‌ గాయం కా­ర­ణం­గా ఆ ఎడి­ష­న్‌­కు దూ­ర­మైన సం­గ­తి తె­లి­సిం­దే. అతడి స్థా­నం­లో­నే బ్రె­వి­స్‌­కు అవ­కా­శం లభిం­చిం­ది. ఇతర జట్లు కూడా పోటీ పడి­నా.. అతడి ధర చూసి వె­న­క్కి తగ్గా­య­ని, సీ­ఎ­స్‌­కే మా­త్రం పట్టు­బ­ట్టి తీ­సు­కుం­ద­ని అశ్వి­న్‌ వ్యా­ఖ్యా­నిం­చా­డు. అతడు చే­సిన వ్యా­ఖ్య­ల­ను బట్టి సీ­ఎ­స్‌­కే బ్రె­వి­స్‌­ను అక్ర­మం­గా తీ­సు­కుం­ద­నే ఆరో­ప­ణ­లు వి­ని­పిం­చి­న­ట్లు క్రి­కె­ట్ వర్గా­లు పే­ర్కొ­న్నా­యి. ఐపీ­ఎ­ల్ కౌ­న్సి­ల్‌ నుం­చి అప్రూ­వ­ల్‌ రా­లే­ద­నే వి­మ­ర్శ­లూ వస్తు­న్నా­యి.

 సీఎస్‌కే దిద్దిన స్టార్‌... 

చె­న్నై సూ­ప­ర్‌ కిం­గ్స్‌ అతి పె­ద్ద మ్యా­చ్‌ వి­న్న­ర్‌­ల­లో ఒక­డి­గా అశ్వి­న్‌ గు­ర్తిం­పు పొం­దా­డు. తొ­లి­సా­రి అతను 2009లో సీ­ఎ­స్‌­కే టీ­మ్‌ ద్వా­రా­నే లీ­గ్‌­లో అడు­గు పె­ట్టా­డు. రెం­డు సీ­జ­న్లు ని­ల­క­డైన ప్ర­ద­ర్శన, ధోని అం­డ­తో అత­ని­కి భారత జట్టు­లో స్థా­నం దక్కిం­ది. 2010, 2011లో సీ­ఎ­స్‌­కే టై­టి­ల్స్‌ సా­ధిం­చ­డం­లో అతను కీ­ల­క­పా­త్ర పో­షిం­చా­డు. వరు­స­గా ఏడే­ళ్ల పాటు 2015 వరకు చె­న్నై­కి ఆడిన అనం­త­రం ఆ తర్వాత ఎని­మి­ది సీ­జ­న్లు వరు­స­గా రై­జిం­గ్‌ పుణే సూ­ప­ర్‌ జె­యిం­ట్స్, కిం­గ్స్‌ ఎలె­వ­న్‌ పం­జా­బ్, ఢి­ల్లీ క్యా­పి­ట­ల్స్, రా­జ­స్తా­న్‌ రా­య­ల్స్‌ జట్ల­కు అశ్వి­న్‌ ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­డు.  2025 వే­లం­లో రూ.9 కో­ట్ల 75 లక్షల మొ­త్తా­ని­కి చె­న్నై అత­డి­ని మళ్లీ సొం­తం చే­సు­కుం­ది. సూ­ప­ర్‌ కిం­గ్స్‌ తర­ఫున 106 మ్యా­చ్‌­లు ఆడిన అశ్వి­న్‌ 6.68 ఎకా­న­మీ­తో 97 వి­కె­ట్లు తీ­శా­డు. ఓవ­రా­ల్‌­గా ఐపీ­ఎ­ల్‌­లో అతను 221 మ్యా­చ్‌­ల­లో 7.20 ఎకా­న­మీ­తో 187 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­డు. 39 ఏళ్ల అశ్వి­న్‌ గత డి­సెం­బ­ర్‌­లో ఆ్ర­స్టే­లి­యా­పై అడి­లై­డ్‌­తో టె­స్టు మ్యా­చ్‌ తర్వాత అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌ నుం­చి రి­టై­ర్‌ అయ్యా­డు. అశ్వి­న్ వ్యా­ఖ్య­ల­తో ఈ వి­వా­దా­ని­కి తె­ర­ప­డే అవ­కా­శం కని­పి­స్తోం­ది.

Tags:    

Similar News