Padma Awards 2025: అశ్విన్‌కు పద్మశ్రీ.. శ్రీజేష్‌కు పద్మ భూషణ్

భారత ఆల్‌టైమ్ గ్రెటేస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ విజయన్‌కు పద్మ శ్రీ;

Update: 2025-01-26 02:00 GMT

76వ రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను శనివారం ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. క్రీడా రంగం, కళా రంగం, వ్యవసాయం, వైద్య వృత్తిలో సేవలందించిన ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. మొత్తం 139 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 139 మందిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు ఉన్నారు.

క్రీడల్లో ఇలా..

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ పురస్కారం లభించింది. క్రీడల విభాగం నుంచి అశ్విన్‌తో పాటు హాకీ దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్, పారా ఆర్చరీ అథ్లెట్ హర్విందర్ సింగ్, ఫుట్‌బాల్ స్టార్ మని విజయన్, పార అథ్లెటిక్ కోచ్ సత్యపాల్ సింగ్‌లను ఈ ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీఆర్ శ్రీజేష్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం పురుషుల జూనియర్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ 106 టెస్ట్‌లు ఆడి 537 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత ఆల్‌టైమ్ గ్రెటేస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ విజయన్‌కు పద్మ శ్రీ అవార్డు దక్కింది. కేరళకు చెందిన విజయ్‌ ఫార్వార్డ్ ప్లేయర్‌గా భారత ఫుట్‌బాల్ కెప్టెన్‌గా వ్యవహరించారు. 72 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 29 గోల్స్ నమోదు చేశారు.

క్రీడల విభాగంలో పురస్కారాలు వచ్చింది వీరికే..

పీఆర్ శ్రీజేష్-కేరళ (హాకీ) పద్మ భూషణ్

హర్విందర్ సింగ్ - హర్యానా (పారా ఆర్చరీ) పద్మశ్రీ

రవిచంద్రన్ అశ్విన్ - తమిళనాడు (క్రికెట్) పద్మశ్రీ

మని విజయన్- కేరళ (ఫుట్బాల్) పద్మశ్రీ

సత్యపాల్ సింగ్- (ఉత్తరప్రదేశ్) పద్మశ్రీ

Tags:    

Similar News