ASHWIN:ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన బౌలింగ్ సైంటిస్ట్
స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు కీలక ప్రకటన... పలు ఫ్రాంచైజీల తరఫున అశ్విన్ ఉత్తమ ప్రతిభ.. \221 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 187 వికెట్లు తీసిన అశ్విన్;
భారత్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించారు. చివరిగా అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ టోర్నీ ఆడాడు. ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీల తరఫున కూడా అశ్విన్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 221 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్, తాజాగా ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోవడంతో.. అతని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భావోద్వేగ పోస్ట్
అశ్విన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదిక X లో వెల్లడించారు. “ఒక ప్రత్యేకమైన రోజు, అందుకే కొత్త ఆరంభం. నా ఐపీఎల్ ప్రయాణం ఇక్కడితో ముగుస్తోంది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌ల్లో ఆడేందుకు నా కొత్త అధ్యాయం మొదలవుతోంది” అని ఆయన తెలిపారు. అశ్విన్ తన 16 సీజన్ల ఐపీఎల్ కెరీర్లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 187 వికెట్లు తీశారు. ఆయన బౌలింగ్ సగటు 30.22 కాగా, ఎకానమీ రేట్ 7.20, స్ట్రైక్ రేట్ 25.2. ఉత్తమ బౌలింగ్ ఫిగర్స్ 4/34 వికెట్లు. బ్యాట్స్‌మన్‌గా కూడా అశ్విన్ రాణించారు. 92 ఇన్నింగ్స్‌ల్లో 833 పరుగులు సాధించారు. 118.15 స్ట్రైక్ రేట్, 13.01 సగటుతో తన బ్యాటింగ్ కొనసాగించారు. ఐపీఎల్ లో అశ్విన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 50 పరుగులు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అశ్విన్ ఎన్నో మధుర క్షణాలను అందించారు. 2010, 2011లో ఐపీఎల్ టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2010లో ఛాంపియన్స్ లీగ్ టి20లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. 2011 ఐపీఎల్ ఫైనల్లో మొదటి ఓవర్ వేసి, క్రిస్ గేల్‌ను డక్ అవుట్ చేసి జట్టును విజయం వైపు నడిపించారు. 2014లో మరోసారి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచారు. 2025లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అశ్విన్ ను రూ. 9.75 కోట్లు వెచ్చించి తిరిగి జట్టులోకి తీసుకుంది.
అశ్విన్‌ది మాస్టర్ మైండ్
38 ఏళ్ల అశ్విన్ పదేళ్ల విరామం తర్వాత 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టిన అశ్విన్ ను చెన్నై రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్ పై సీఎస్కె యాజమాన్యం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అయితే ఐపీఎల్ 2025లో అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడి 9.13 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణించింది లేదు. ఐపీఎల్ 2026 సీజన్ లో అశ్విన్ ను రిలీజ్ చేయడం ఖాయమనే హింట్స్ చెన్నై జట్టు నుంచి అందాయి. 2009 నుండి 2015 వరకు ఆరు సీజన్లు సీఎస్కె జట్టు తరపున ఆడాడు. 2016 నుంచి 2024 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.