ASIA CUP : సూర్యా భాయ్ సారథ్యంలోనే ఆసియా కప్ బరిలోకి..

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్.. జట్టు ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ.. సూర్య కెప్టెన్సీలోనే బరిలోకి టీమిండియా.. స్టార్లకు మళ్లీ భారత జట్టులో చోటు;

Update: 2025-08-08 07:00 GMT

ఆసి­యా కప్ 2025 ఈసా­రి టీ20 ఫా­ర్మా­ట్లో యూఏఈ వే­ది­క­గా సె­ప్టెం­బ­ర్ 9 నుం­చి 28 వరకు జరు­గ­నుం­ది. ఆతి­థ్య హక్కు­లు భా­ర­త్‌ దగ్గ­రే ఉన్నా.. గతం­లో పా­కి­స్తా­న్‌­తో ఒప్పం­దం­లో భా­గం­గా తట­స్థ వే­దిక యూ­ఏ­ఈ­లో మ్యా­చ్‌­లు జరు­గ­ను­న్నా­యి. టో­ర్నీ­లో మొ­త్తం 8 జట్లు బరి­లో­కి ది­గ­నుం­డ­గా.. అబు­దా­బి, దు­బా­య్ వే­ది­క­గా మ్యా­చ్‌­లు జర­గ­ను­న్నా­యి. సె­ప్టెం­బ­ర్ 10న ఆతి­థ్య యూ­ఏ­ఈ­తో భా­ర­త్ తన మొ­ద­టి మ్యా­చ్‌ ఆడ­నుం­ది. టో­ర్నీ­కి ఇంకా నెల రో­జుల సమయం ఉన్నా.. బీ­సీ­సీఐ సె­లె­క్ట­ర్లు జట్టు­పై దృ­ష్టి సా­రిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో ఆసి­యా కప్ 2025కు ఊహిం­చ­ని స్వ్కా­డ్ ఉం­టుం­ద­ని తె­లు­స్తోం­ది.ఈ మెగా టో­ర్న­మెం­ట్ కోసం భారత జట్టు­లో కీలక మా­ర్పు­లు సం­భ­విం­చ­బో­తు­న్నా­యి. ఈసా­రి జట్టు­లో సీ­ని­య­ర్ల­కు బదు­లు­గా కొ­త్త యువ ఆట­గా­ళ్ల­కు ఎక్కువ అవ­కా­శం ఉండే అవ­కా­శ­ముం­ది. ఈ ఆసి­యా కప్లో యువ ఆట­గా­ళ్ల మధ్య తీ­వ్ర­మైన పోటీ ఉంది, ఓపె­న­ర్లు గిల్, జై­స్వా­ల్, అభి­షే­క్ శర్మ­కు స్థా­నం ఖా­యం­గా కని­పి­స్తోం­ది. మి­డి­ల్ ఆర్డ­ర్లో తి­ల­క్, రిం­కూ సిం­గ్, సంజు శాం­స­న్, సాయి సు­ద­ర్శ­న్ ఉండే అవ­కా­శం ఉంది. బౌ­లిం­గ్లో బు­మ్రా ఫిట్ కా­క­పో­తే, యువ పే­స­ర్ల­కు ఛా­న్స్ దక్కొ­చ్చు.

సారధిగా సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈ ఆసియా కప్‌లో భారత జట్టుకు సూర్య భాయ్ నాయకత్వం వహించనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న సూర్యా.. జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకున్నాడు. అయితే సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగబోయే ఆసియా కప్ ప్రారంభానికి ముందు పూర్తిగా ఫిట్ గా ఉం­టా­డా లేదా అన్న­ది ఆస­క్తి రే­పు­తోం­ది. అజి­త్ అగా­ర్క­ర్ నే­తృ­త్వం­లో­ని బీ­సీ­సీఐ సె­ల­క్ష­న్ కమి­టీ ఆగ­స్టు 3వ వా­రం­లో భారత జట్టు­ను ప్ర­క­టిం­చ­నుం­ది. ఐపీ­ఎ­ల్ 2025లో అత్యు­త్తమ ప్ర­ద­ర్శన చే­సిన టీ­మిం­డి­యా స్టా­ర్స్ శు­భ్‌­మా­న్ గిల్, యశ­స్వి జై­స్వా­ల్, శ్రే­యా­స్ అయ్య­ర్ తి­రి­గి జట్టు­లో­కి వచ్చే అవ­కా­శం ఉంది. జీటీ ఆట­గా­డు సాయి సు­ద­ర్శ­న్ కూడా ఆసి­యా కప్ 2025కు ఎం­పి­క­య్యే అవ­కా­శా­లు ఉన్న­ట్లు సమా­చా­రం. అలా­నే ఆర్‌­సీ­బీ వి­జ­యం­లో కీలక పా­త్ర పో­షిం­చిన ఆల్‌­రౌం­డ­ర్ కృ­నా­ల్ పాం­డ్యా పే­రు­ను కూడా బీ­సీ­సీఐ సె­లె­క్ట­ర్లు పరి­శీ­లి­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది.

తిరిగిరానున్న స్టార్లు

మొ­న్న­టి­వ­ర­కు వి­శ్రాం­తి తీ­సు­కు­న్న స్టా­ర్ ఆట­గా­ళ్లు ఈసా­రి మళ్లీ జట్టు­లో కల­వ­ను­న్నా­రు. ఇప్పు­డు కీలక టో­ర్నీ కా­వ­డం­తో టాప్ ఆట­గా­ళ్ల­ను ఎం­పిక చే­యా­ల­ని సె­లె­క్ట­ర్లు భా­వి­స్తు­న్నా­రు. సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ సా­ర­థ్యం­లో టాప్ జట్టు­ను ఎం­పిక చే­యా­ల­ని చీఫ్ సె­లె­క్ట­ర్ అజి­త్ అగా­ర్క­ర్, కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్ డి­సై­డ్ అయ్యా­రట. ఈ క్ర­మం­లో­నే గిల్, యశ­స్వి , శ్రే­యా­స్, కృ­నా­ల్ జట్టు­లో­కి రా­ను­న్నా­రు. సంజూ శాం­స­న్‌ ప్ర­ధాన వి­కె­ట్ కీ­ప­ర్‌­గా ఉం­టా­డ­ని తె­లు­స్తోం­ది. గాయం కా­ర­ణం­గా రి­ష­భ్‌ పం­త్‌ ఎం­పి­క­య్యే అవ­కా­శా­లు లేవు. స్టా­ర్ పే­స­ర్లు జస్‌­ప్రీ­త్ బు­మ్రా, మహ్మ­ద్ సి­రా­జ్ ఫి­ట్‌­నె­స్ పరీ­క్ష­లు పా­స­వ్వా­లి.

భారత జట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్, కృనాల్ పాండ్యా.

Tags:    

Similar News