బిహార్ వేదికగా త్వరలో ప్రారంభంకానున్న పురుషుల ఆసియా కప్‌కు భారత హాకీ జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. మొత్తం 18 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఆసియా కప్ జరగనుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఈ నెల 29న చైనాతో తలపడనుంది. ఆ తర్వాత 31న జపాన్‌తో, సెప్టెంబర్ 1న కజకస్థాన్లను ఎదుర్కోనుంది. వచ్చే ఏడాది జరగబోయే ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్‌కు ఈ టోర్నీ క్వాలిఫయర్. ఆసియా కప్ గెలవడం భారత్‌కు చాలా కీలకం. కాబట్టి, ఈ టోర్నీకి హాకీ ఇండియా బలమైన జట్టును ఎంపిక చేసింది. మిడిఫీల్డ్, డిఫెన్స్, ఎటాక్ ఇలా అన్ని విభాగాల్లో సమతుల్యతను పాటించింది. అనుభవజ్ఞుల వైపు మొగ్గు చూపింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత జట్టులో ఉన్న జర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, మన్దీప్ సింగ్, వివేక్ సాగ్ ప్రసాద్, రాజ్ కుమార్ పాల్, సుమిత్, అమిత్ రోహిదాస్ వంటి ప్లేయర్లు ఆసియా కప్‌కు ఎంపిక చేశారు. అయితే, మిడిఫీల్డర్ షంషేర్ సింగ్‌కు చోటు దక్కలేదు.