Asia Cup: నేటి నుంచే ఆసియా కప్‌

అస్త్ర శస్త్రాలతో సిద్ధమైన జట్లు... ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న టీంలు..

Update: 2023-08-30 00:45 GMT

 ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌(World Cup )నకు సన్నాహకంగా భావిస్తున్న ఆసియాకప్‌ టోర్నీ(asia cup) నేటి నుంచి ఆరంభం కానుంది. తొలిమ్యాచ్‌లో పాకిస్తాన్‌, నేపాల్‌(pakisthan-nepal) తలపడనున్నాయి. గ్రూప్‌ దశలో సెప్టెంబర్‌ 2న పాకిస్తాన్‌తో(India versus Pakistan)ను, సెప్టెంబర్‌ 4న నేపాల్‌తోనూ భారత్‌ పోటీపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు భారత్‌ జట్టుకు KL రాహుల్(K.L.rahul) దూరమయ్యాడు. సెప్టెంబర్‌ 6 నుంచి 15 వరకు సూపర్‌-4 దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. 17న ఫైనల్ మ్యాచ్‌ కొలంబో వేదికగా జరగనుంది.


పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ కోసం బెంగళూర్‌లో టీమిండియా(team india) ముమ్మరంగా సాధన చేసింది. ఆసియాకప్‌లో ఆరు దేశాలు( six teams) తలపడనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ - నేపాల్‌ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ ఇప్పుడు మళ్లీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకుంది. ఇప్పటి వరకు భారత్‌ అత్యధికంగా ఏడుసార్లు ఆసియాకప్‌లో విజేత(seven-time champions )గా నిలిచింది. ఈసారి కూడా నాలుగు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. భారత్‌, పాకిస్థాన్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్ రేసులో ఉన్నాయి.

వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రతి జట్టూ తమ శక్తిసామర్థ్యాలను పరీక్షించుకునేందు ఇదొక వేదికగా మార్చుకొనే అవకాశం ఉంది. నాలుగు వేదికల్లో ఆసియా కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లోని ముల్తాన్‌, లాహోర్‌తోపాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌ గ్రూప్‌-ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్‌దశలో భారత్‌ సెప్టెంబర్‌ 2న పాకిస్తాన్‌తోనూ, సెప్టెంబర్‌-4న నేపాల్‌తోనూ తలపడనుంది. రోహిత్‌శర్మ నేతృత్వంలో భారత జట్టు ఈ టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. గాయం కారణంగా పాకిస్తాన్‌, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు KL రాహుల్ దూరంకానున్నాడు. ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 

Tags:    

Similar News