AUS: ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం

Update: 2025-10-30 07:00 GMT

ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ కన్నుమూశాడు. బౌలింగ్ మెషిన్‌తో మంగళవారం రాత్రి ప్రాక్టీస్ చేస్తుండగా బంతి నేరుగా వచ్చి మెడ భాగంలో వెనుక భాగంలో బలంగా తగిలింది. దీంతో బెన్ ఆస్టిన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చిన్న మెదడకు గాయమైనట్లుగా వైద్యులు గుర్తించారు. అతడి మరణాన్ని ఫెర్న్‌ట్రీ క్రికెట్ క్లబ్ ధృవీకరించింది. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్, బెన్ ఆస్టిన్ మరణంతో తన గుండె పగిలిందని కామెంట్ చేశారు. అనంతరం అతడి మృతి పట్ల సెయింట్ డేవిడ్స్, కిల్సిత్, మిచామ్ వంటి స్థానిక క్లబ్‌లు సంతాపం తెలిపాయి. కాగా, సరిగ్గా పదకొండేళ్ల కిందట కౌంటీ మ్యాచ్‌లో ఇదే ఆస్ట్రేలియా జట్టుకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ ఫిల్‌ హ్యూస్ తలకు బంతి తగిలి మరణించాడు.

Tags:    

Similar News