Australian Open 2023: రఫెల్ నాదల్ ఓటమి

రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు...

Update: 2023-01-18 11:32 GMT


ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ రఫెన్ నాదల్ వెనుదిరిగాడు. 23వ గ్రాండ్ స్లామ్ అందుకోవాలన్న కల నెరవేరలేదు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో అమెరికాకు చెందిన అప్సీడెడ్ మెకంజీ మెక్ డొనాల్డ్ చేతిలో 4-6, 4-6,5-7 తేడాతో ఓటమి పాలయ్యాడు. తుంటి గాయంతో బాధపడుతున్న నాదల్ తన అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వలేకపోయాడు. రెండో సెట్ జరుగుతున్నప్పుడే మెడికల్ టైమ్ ఔట్ తీసుకున్నాడు. రెండు రోజులుగా తాను, హిప్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. గతంలోనూ.. ఈ సమస్య బాధపెట్టిందని చెప్పాడు.

రెండు రోజులుగా తుంటి నొప్పి బాధపెడుతుండగా.... బుధవారం ఉన్న నొప్పి గతంలో లేదని నాదల్ చెప్పాడు. పరిస్థితులు కఠినంగా మారాయని అన్నాడు. టెన్నిస్ ఆడటం తనకు చాలా ఇష్టమని, ప్రస్తుత ఓటమి కృంగ తీయడం లేదని అన్నారు. బహుశా తాను అబద్దం చెప్పి ఉండవచ్చని ఆవేదన వ్యక్తం చేశాడు. రానున్న 7 నెలలు తనకు కఠినమైన కాలమని, ఆటకు కొన్ని రోజులు విరామం తప్పకుండా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు.

Tags:    

Similar News