Bajrang Punia : భారత్ ఖాతాలో మరో పతకం..!
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్యం కోసం జరిగిన పోటీలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా విజయం సాధించాడు;
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది.. పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు.. కజకిస్తాన్ రెజ్లర్ జకోవ్‌ను భజరంగ్ పునియా మట్టి కరిపించాడు. పురుషుల 65 కేసీల విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో 8-0 తేడాతో భజరంగ్ పునియా ఘన విజయాన్ని సాధించాడు. మ్యాచ్ ఆసాంతం ఏకపక్షంగానే సాగింది.. భజరంగ్ పట్టుతో ప్రత్యర్థి వ్యూహాలు మొత్తం చిత్తయిపోయాయి.. చివరకు 8-0 తేడాతో భజరంగ్ విజయాన్ని అందుకున్నాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. భారత్ సాధించిన ఆరు పతకాల్లో రెండు రజత పతకాలు ఉండగా.. నాలుగు కాంస్యాలు వున్నాయి..