AUS vs BAN : కుప్పకూలిన బంగ్లాదేశ్ .. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం..!
AUS vs BAN : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ కుప్పకూలింది. 15 ఓవర్లలలో కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది.;
AUS vs BAN : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ కుప్పకూలింది. 15 ఓవర్లలలో కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. దీనితో ఆసీస్ ముందు 74 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఉంచింది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకొని బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంగ్లాదేశ్ ను ఎక్కడ కూడా నిలదోక్కుకుండా ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 5, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ రెండేసి, గ్లెన్ మాక్స్ వెల్ ఒక వికెట్ తీశారు. మొత్తం బంగ్లా ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క సిక్సర్ మాత్రమే నమోదైంది.