BAVUMA: పోరాడి సాధించుకున్న ధీరుడు
వివక్షను ఎదురుకున్న వీరుడు.. ఇదీ శ్వేత వర్ణం సాధించలేని విజయం;
టెంబా బవుమా.. ప్రపంచ క్రికెట్ చరిత్ర ఎప్పుడు మరిచిపోలేని, మరిచిపోకూడని పేరు. పేరుకి జెంటిల్‌మేన్ గేమ్ అయిన ఇందులో దుష్ట రాజకీయాలకు కొదువేమి లేదు. ప్రపంచంలోనే అత్యంత దరిద్రమైన వర్ణ వివక్షను, కుతంత్ర రాజకీయాలను ఎదురుకొని వచ్చిన హీరో అని బవుమా కథ మొదలు పెట్టొచ్చు. కానీ.. అతడిని భారతీయ పరిభాషలో హీరో పదాన్ని ఉపయోగించే విధానంతో పోలిస్తే తక్కువ చేసినట్లే అవుతుంది. అతడొక డాన్.. నిజమే అతనొక డాన్. దుమ్ము దూళితో కూడిన విధుల్లో సొంత దేశంలోనే వర్ణ వివక్ష ఎదురుకున్న ఒక నిస్సహాయ యువకుడు.. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్లకు ఎదురెళ్లి సూపర్ డాన్‌గా ఎదిగాడు. అతడి రంగు ఎవరికి నచ్చదు, అతని శారీరిక రూపం అంటే పైకి చెప్పకపోయినా చాలా మందికి అసహ్యం. స్వతంత్ర దేశంలో అంటరానివాడు. ఆ అంటరానివాడే ఈరోజు ఆ దేశ పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా రెపరెపలాడించాడు. అందుకే అతన్ని క్రికెట్ పిచ్చోళ్లు 'ది డాన్.. బవుమా' అని పిలుస్తారు.
నేపథ్యమిదే
కేప్‌టౌన్‌లోని దుమ్ము దూళితో కూడుకున్న ఓ వీధిలో పుట్టాడు బవుమా. నేషనల్ టీంలోకి వెళ్లడం సాధ్యం కాదని తెలిసిన.. ఎప్పుడు ఆ దుమ్ము దూళిలోనే క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. నేషనల్ టీంలోకి వెళ్లడానికి అతనికి ప్రతిభ అడ్డంకు కాదు. అతని సొంత దేశంలోకి వచ్చి స్థిరపడి వారి స్థానాలను కబ్జా చేసిన శ్వేతా వర్ణానిది. అనూహ్యంగా ఆ దేశానికి ఆ రంగే ఇంపుగా కనిపించింది. అన్ని రంగాలతో పాటు క్రికెట్‌లోను పూర్తిగా వారికే స్థానాలను కేటాయించారు. కానీ.. ఆ శ్వేతా వర్ణం ఎప్పుడు ఆ దేశ జెండాని క్రికెట్ ప్రపంచం ముందు రెపరెపలాడించలేకపోయింది. అందుకే.. ఆ దేశంలో చిన్న విప్లవం మొదలైంది. అన్ని రంగాలతో పాటు క్రికెట్‌లోను రిజర్వేషన్లు తీసుకురావాలని పోరాడారు. దీని ఫలితంగానే టెంబా బవుమా అనే చోటా బాంబ్ టీంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అతనిదే రిజర్వేషన్ కోటా అని శ్వేతా వర్ణం ఎక్కిరించింది. ప్రతిభ ఉన్న ఆ యంగ్ క్రికెటర్‌పై తీవ్రమైన వివక్షతనే ప్రదర్శించారు. 2021లో టెస్ట్ టీం కెప్టెన్‌గా ఎన్నికైన బవుమా టీంని ఇప్పటి వరకు ఎవరు ఓడించలేకపోయారు. అందుకే.. కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీలోను ఓడని ప్యాట్ కమ్మిన్స్ సేనను ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఓడించాడు. క్రికెట్‌కు ఒరిజినల్ డాన్లు కంగారులను పరిగెత్తించిన రియల్ డాన్‌గా బవుమా నిలిచాడు.