BCCI: బీసీసీఐకి రూ. 9,741 కోట్ల ఆదాయం!
బీసీసీఐకి బంగారు గుడ్లు పెట్టే బాతుల ఐపీఎల్;
ఇండియాలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో మరోసారి నిరూపించబడింది. ఎంటర్ టైన్ మెంట్ ద్వారానే కాకుండా బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. 2023-2024 సంవత్సరానికి గాను దాదాపు రూ. 1000 కోట్లు సంపాదించింది. రిపోర్ట్స్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఎప్పటిలాగే దేశంలో ప్రధాన లీగ్ అయినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొత్తం ఆదాయంలో 59 శాతంతో ప్రధాన వాటాదారుగా నిలిచింది. కేవలం ఐపీఎల్ నుంచే రూ.5,761 కోట్లు ఆర్జించగా.. ఐపీఎల్ యేతర మీడియా హక్కుల ద్వారా బోర్డు అదనంగా రూ.361 కోట్లు సంపాదించింది. 2007 నుంచి ఐపీఎల్ బీసీసీఐకి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. రంజీ ట్రోఫీతో సహా వివిధ స్థాయిల క్రికెట్ ఆటగాళ్లకు అవకాశాలను అందిస్తోంది. ఐపీఎల్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే అది బీసీసీఐకి భారీ నష్టంగా మారే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఐపీఎల్దే అధిక వాటా
ఐపీఎల్ ఒక వార్షిక ఫ్రాంచైజీ ఆధారిత టీ20 టోర్నమెంట్. 2007లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో పది జట్లు పోటీపడతాయి. ‘ది హిందూ బిజినెస్ లైన్’లోని రెడిఫ్యూషన్ రిపోర్ట్ ప్రకారం బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,741.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఇందులో ఐపీఎల్ రూ. 5,761 కోట్లను సమకూర్చింది. “2007లో బీసీసీఐ ఒక బంగారు గుడ్లు పెట్టే బాతును కనుగొంది.. అదే ఐపీఎల్. ఇది ఇప్పుడు బీసీసీఐలో 100 శాతం భాగం. ఈ టోర్నమెంట్ అత్యుత్తమమైనది. మీడియా హక్కులు నిరంతరం పెరుగుతున్నాయి. ఐపీఎల్ రంజీ ట్రోఫీ స్థాయి ఆటగాళ్లకు కూడా ఆడే అవకాశాన్ని అందిస్తోంది. ఐపీఎల్ తన వృద్ధితో పాటు లాభాలను కూడా ఆర్జిస్తోంది’’అని వ్యాపార వ్యూహకర్త, స్వతంత్ర డైరెక్టర్ లాయిడ్ మథియాస్ ఈ ప్రచురణలో పేర్కొన్నారు.