BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా కిరణ్ మోరే..!
హర్భజన్ సింగ్‌కు బీసీసీఐ కీలక పదవి.. ?
బీసీసీఐ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. రోజర్ బిన్నీ రాజీనామా చేయడంతో ప్రస్తుతం బీసీసీఐ కొత్త అధ్యక్షుడి వేటలో ఉంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐ అధ్యక్షుడు అవుతారంటూ వార్తలు వచ్చినా దానిని సచిన్ ఖండించాడు. త్వరలోనే ఈ పోస్టుకు చీఫ్ ను ఎన్నుకోనున్నారు. అయితే మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఈ పదవిని అలంకరించేందుకు మెజారిటీ అవకాశముందని తెలుస్తోంది. 63 ఏళ్ల భారత మాజీ ఆటగాడు కిరణ్ మోరె కూడా ఈ రేసులో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వెస్ట్ జోన్ నుంచి ఈసారి అధ్యక్షుడిగా అవకాశం దక్కనుంది.
హర్భజన్‌కు కీలక పదవి.. ?
మరో రెండు వారాల్లో భారత క్రికెట్ బోర్డు సర్వసభ్య సమావేశం జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో ఆ పదవిలోకి మరోసారి మాజీ క్రికెటర్‌కే ఛాన్స్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సచిన్ తెందూల్కర్ పేరు రాగా.. ఆయన టీమ్ ఆ కథనాలను ఖండించింది. తాజాగా మాజీ క్రికెటర్లు కిరణ్ మోరె, హర్భజన్ సింగ్ పేర్లు వార్తల్లోకి వచ్చాయి. హర్భజన్ సింగ్‌కు బీసీసీఐ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది క్రికెట్ వర్గాల మాట. దానికి పంజాబ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా బలం చేకూరుస్తోంది. ఏజీఎంలో తమ ప్రతినిధిగా హర్భజన్‌ను పంజాబ్ నామినేట్ చేసింది. పంజాబ్ తరఫున సర్వసభ్య సమావేశానికి హర్భజన్ హాజరవుతాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా బెంగాల్ క్రికెట్ సంఘం తరఫున ఏజీఎంలో పాల్గొంటాడు.