BCCI: బీసీసీఐ ఖాతాలో రూ.20 వేల కోట్లకుపైగా నిధులు

ఐపీఎల్‌తో బీసీసీఐకి భారీగా ఆదాయం.. 2023-24లో రూ.1,623 కోట్ల మిగులు నిధులు... గత ఏడాదే బీసీసీఐకి రూ.4,193 కోట్ల ఆదాయం

Update: 2025-09-08 06:30 GMT

ప్ర­పం­చం­లో­నే అత్యంత సం­ప­న్న క్రి­కె­ట్ బో­ర్డు­గా పే­రు­గాం­చిన బీ­సీ­సీఐ తన ఖజా­నా­ను మరింత నిం­పు­కుం­ది. 2023-24 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి గాను బీ­సీ­సీఐ ఆర్థిక ని­వే­ది­క­లో ఆశ్చ­ర్య­ప­రి­చే వి­ష­యా­లు వె­లు­గు­లో­కి వచ్చా­యి. రా­ష్ట్ర క్రి­కె­ట్ సం­ఘా­ల­కు పం­పి­ణీ చే­సిన ని­వే­దిక ప్ర­కా­రం, ఈ ఏడా­ది మా­ర్చి ము­గి­సే­నా­టి­కి బీ­సీ­సీఐ బ్యాం­క్ ఖా­తా­ల్లో ఏకం­గా రూ. 20,686 కో­ట్ల నగదు ని­ల్వ­లు ఉన్నా­యి. గత ఐదే­ళ్ల­లో బో­ర్డు సంపద దా­దా­పు మూడు రె­ట్లు పె­రి­గి­న­ట్లు సమా­చా­రం. అత్యంత వి­జ­య­వం­త­మైన ఐపీ­ఎ­ల్‌­తో బో­ర్డు­కు భా­రీ­గా ఆదా­యం వస్తోం­ది. అలా­గే ఐసీ­సీ నుం­చి అందే వా­టా­తో­పా­టు అం­త­ర్జా­తీయ, దే­శ­వా­ళీ మ్యా­చుల మీ­డి­యా హక్కుల నుం­చి ఆదా­యం అం­దు­తోం­ది.  బీ­సీ­సీఐ 2023-24 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి­గా­ను రూ. 1,623 కో­ట్ల మి­గు­లు నమో­దు చే­సిం­ది. ఇది అం­త­కు­ముం­దు ఏడా­ది రూ.1,167 కో­ట్లు­గా ఉం­డే­ది.

ఐదేళ్లలో అనూహ్యంగా పెరిగిన సంపద

గత ఐదే­ళ్ల కా­లం­లో బీ­సీ­సీఐ సంపద అనూ­హ్యం­గా పె­రి­గిం­ది. 2018-19 ఆర్థిక సం­వ­త్స­రం­లో రా­ష్ట్ర సం­ఘా­ల­కు ని­ధు­లు పం­పి­ణీ చే­య­క­ముం­దు బో­ర్డు వద్ద రూ. 6,059 కో­ట్లు ఉం­డ­గా, ఇప్పు­డు అన్ని పం­పి­ణీ­లు పూ­ర్త­య్యాక కూడా రూ. 20 వేల కో­ట్ల­కు పైగా బ్యా­లె­న్స్ ఉం­డ­టం వి­శే­షం. కే­వ­లం గత ఆర్థిక సం­వ­త్స­రం­లో­నే బీ­సీ­సీఐ ఆస్తి­కి రూ. 4,193 కో­ట్లు అద­నం­గా చే­రా­యి. ఐదే­ళ్ల­లో మొ­త్తం రూ. 14,627 కో­ట్ల వృ­ద్ధి నమో­దైం­ది. ఇదే సమ­యం­లో బీ­సీ­సీఐ జన­ర­ల్ ఫండ్ కూడా 2019లో రూ. 3,906 కో­ట్ల నుం­చి 2024 నా­టి­కి రూ. 7,988 కో­ట్ల­కు పె­రి­గిం­ది. బీ­సీ­సీఐ వద్ద 2019 నా­టి­కి రూ.6 వేల కో­ట్లు మా­త్ర­మే ఉం­డే­వి. అయి­తే, గత ఐదే­ళ్ల­లో అద­నం­గా రూ.14,627 కో­ట్ల సం­ప­ద­ను సృ­ష్టిం­చిం­ది.

ఏడాదే రూ.4,193 కోట్ల ఆదాయం

‘‘బీ­సీ­సీఐ సభ్యు­ల­కు కా­ర్య­ద­ర్శి సమ­ర్పిం­చిన వి­వ­రాల ప్ర­కా­రం.. 2019లో రా­ష్ట్ర సం­ఘా­ల­కు చె­ల్లిం­చా­ల్సిన వా­టి­తో కలి­పి బ్యాం­క్ బ్యా­లె­న్స్ అండ్ క్యా­ష్   రూ.6,059 కో­ట్లు ఉం­డే­ది. ఇప్పు­డు ఆయా సం­ఘా­ల­కు చె­ల్లిం­చి­న­ది పోగా మి­గు­లు రూ.20,686 కో­ట్ల­కు చే­రిం­ది. గత ఐదే­ళ్ల­లో రూ.14,627 కో­ట్ల సంపద అద­నం­గా వచ్చి చే­రిం­ది. ఒక్క గతే­డా­దే రూ.4,193 కో­ట్ల ఆదా­యం వచ్చిం­ది. 2023-24 ఆర్థిక సం­వ­త్స­రం­లో బీ­సీ­సీఐ రూ. 1,200 కో­ట్ల­ను మై­దా­నా­ల్లో మౌ­లిక సదు­పా­యాల కోసం కే­టా­యిం­చిం­ది. ప్లా­టి­న­మ్‌ జూ­బ్లీ ఫం­డ్‌­గా రూ. 350 కో­ట్లు, క్రి­కె­ట్‌ అభి­వృ­ద్ధి కోసం రూ. 500 కో­ట్లు కే­టా­యిం­చిం­ది. రా­ష్ట్ర క్రి­కె­ట్ సం­ఘా­లు రూ.1,990 కో­ట్లు అం­దు­కొ­న్నా­యి’’ అని క్రి­కె­ట్ వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. బీ­సీ­సీఐ ఆదా­య­పు పన్ను చె­ల్లిం­పుల కోసం రూ. 3,150 కో­ట్ల­ను కే­టా­యిం­చిం­ది. దే­శం­లో క్రి­కె­ట్ మౌ­లిక సదు­పా­యాల అభి­వృ­ద్ధి­కి రూ. 1,200 కో­ట్లు, మాజీ ఆట­గా­ళ్ల సం­క్షే­మం కోసం ప్లా­టి­నం జూ­బ్లీ ఫం­డ్‌­కు రూ. 350 కో­ట్లు, ఇతర అభి­వృ­ద్ధి పను­ల­కు మరో రూ. 500 కో­ట్లు కే­టా­యిం­చి­న­ట్లు ని­వే­ది­క­లో పే­ర్కొ­న్నా­రు. ఈ నెల 28న ముం­బై­లో జర­గ­ను­న్న బీ­సీ­సీఐ వా­ర్షిక సర్వ­స­భ్య సమా­వే­శం­లో 2024-25 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి సం­బం­ధిం­చిన వి­వ­రా­లు వె­ల్ల­డిం­చ­ను­న్నా­రు. రూ.20,686 కో­ట్ల­కు చే­రు­కు­ని ప్ర­పం­చం­లో­నే అత్యంత ధన­వం­త­మైన క్రి­కె­ట్ సం­స్థ­గా ని­లి­పిం­ది. ఈ పె­రు­గు­దల రా­ష్ట్ర సం­ఘా­ల­కు చె­ల్లిం­చా­ల్సిన తర్వాత మి­గి­లిం­ద­ని బీ­సీ­సీఐ కా­ర్య­ద­ర్శి వె­ల్ల­డిం­చా­రు. సె­ప్టెం­బ­ర్ 28న జర­గ­ను­న్న వా­ర్షిక సర్వ­స­భ్య సమా­వే­శం­లో ఆమో­దిం­చ­బ­డు­తుం­ది.

Tags:    

Similar News