BCCI: 18వ నంబర్‌ జెర్సీతో పంత్‌.. రచ్చ.. రచ్చ

కోహ్లీ జెర్సీ నెంబర్‌తో కనిపించడంపై అభిమానుల ఆగ్రహం

Update: 2025-10-31 04:30 GMT

దక్షి­ణా­ఫ్రి­కా Aతో జరు­గు­తు­న్న అన­ధి­కా­రిక తొలి టె­స్టు­లో టీ­మిం­డి­యా వి­కె­ట్ కీ­ప­ర్ కమ్ బ్యా­ట­ర్ రి­ష­భ్ పంత్ 18వ నం­బ­ర్‌ జె­ర్సీ­తో బరి­లో­కి ది­గా­డు. పంత్ కో­లు­కు­ని మళ్లీ మై­దా­నం­లో కని­పిం­చ­డం అభి­మా­ను­లు హర్షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. అయి­తే, 18 నం­బ­ర్‌ జె­ర్సీ టీ­మ్‌ ఇం­డి­యా స్టా­ర్‌ వి­రా­ట్ కో­హ్లీ­ది కా­వ­డం­తో కొంత వి­వా­దా­స్ప­ద­మైం­ది. కో­హ్లీ టె­స్టు­ల­కు వీ­డ్కో­లు పలి­కిన వి­ష­యం తె­లి­సిం­దే. పంత్ ఫో­టో­లు నె­ట్టింట వై­ర­ల్ అవు­తు­న్నా­యి. సా­ధా­ర­ణం­గా పంత్ జె­ర్సీ నం­బ­ర్ 17. పొ­ర­పా­టున 18గా ము­ద్రి­త­మైన జె­ర్సీ­ని ధరిం­చా­డా?అనే సం­దే­హం అభి­మా­ను­ల్లో నె­ల­కొం­ది. లే­క­పో­తే కా­వా­ల­నే ఆ నం­బ­ర్‌ జె­ర్సీ­ని వే­సు­కొ­ని వచ్చా­డా? అనే­ది చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. అయి­తే, ఇం­త­కు­ముం­దు ము­కే­శ్‌ కు­మా­ర్‌ (జె­ర్సీ నం­బ­ర్ 49) కూడా గత ఇం­గ్లాం­డ్‌ పర్య­ట­న­కు ముం­దు ‘A’ జట్టు తర­ఫున బరి­లో­కి ది­గి­న­ప్పు­డు 18వ నం­బ­ర్‌ జె­ర్సీ­ని ధరిం­చా­డు. స్టా­ర్‌ ఆట­గా­ళ్లు ఆటకు వీ­డ్కో­లు పలి­కి­న­ప్పు­డు ఆ జె­ర్సీ నం­బ­ర్ల­కు కూడా రి­టై­ర్‌­మెం­ట్ ఇచ్చే­య­డం ఆన­వా­యి­తీ­గా వస్తోం­ది. సచి­న్‌ తెం­దూ­ల్క­ర్‌ (10), ఎం­ఎ­స్ ధోనీ (7) ఆటకు గు­డ్‌­బై చె­ప్పి­న­ప్పు­డు బీ­సీ­సీఐ ఇలా­నే చే­సిం­ది.

రిషభ్ పంత్ రీఎంట్రీ

గా­యం­తో ఆటకు దూ­ర­మైన టీ­మిం­డి­యా వి­కె­ట్ కీ­ప­ర్ రి­ష­భ్ పంత్ పంత్ మై­దా­నం­లో­కి అడు­గు­పె­ట్టా­డు. బెం­గ­ళూ­రు­లో­ని బీ­సీ­సీఐ సెం­ట­ర్ ఆఫ్ ఎక్స్‌­లె­న్స్ గ్రౌం­డ్ వే­ది­క­గా సౌ­తా­ఫ్రి­కా-ఏతో గు­రు­వా­రం ప్రా­రం­భ­మైన తొలి అన­ధి­కార టె­స్ట్‌­తో పంత్ పు­న­రా­గ­మ­నం చే­శా­డు. ఈ మ్యా­చ్‌­లో భా­ర­త్-ఏ జట్టు­ను నడి­పి­స్తు­న్న రి­ష­భ్ పంత్.. టాస్ గె­లి­చి బౌ­లిం­గ్ ఎం­చు­కు­న్నా­డు. పిచ్ కం­డి­ష­న్స్ నే­ప­థ్యం­లో­నే ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­న­ని చె­ప్పా­డు. ఇం­గ్లం­డ్ పర్య­ట­న­లో నా­లు­గో టె­స్ట్ సం­ద­ర్భం­గా రి­ష­భ్ పంత్ పా­దా­ని­కి తీ­వ్ర గా­య­మైన వి­ష­యం తె­లి­సిం­దే. అయి­నా నొ­ప్పి­ని భరి­స్తూ­నే బ్యా­టిం­గ్ కొ­న­సా­గిం­చిన పంత్.. ఆఖరి టె­స్ట్ ఆడ­కుం­డా­నే స్వ­దే­శా­ని­కి తి­రి­గి వచ్చా­డు. గాయం తీ­వ్రత ఎక్కు­వ­గా ఉం­డ­టం­తో అతను ఇం­టి­కే పరి­మి­త­మ­య్యా­డు. ఈ గాయం కా­ర­ణం­గా పంత్.. ఆసి­యా కప్ టో­ర్నీ­తో పాటు ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­కు దూ­ర­మ­య్యా­డు. గాయం నుం­చి కో­లు­కు­న్న పంత్ రంజీ ట్రో­ఫీ­లో ఢి­ల్లీ తర­ఫున రీ­ఎం­ట్రీ ఇస్తా­ర­ని అంతా అను­కు­న్నా­రు. కానీ పంత్ బరి­లో­కి ది­గ­లే­దు. సౌ­తా­ఫ్రి­కా­తో రెం­డు టె­స్ట్‌­ల­కు సన్నా­హ­కం­గా జరు­గు­తు­న్న అన­ధి­కార టె­స్ట్ సి­రీ­స్‌­తో రీ­ఎం­ట్రీ ఇచ్చా­డు. రెం­డో అన­ధి­కార మ్యా­చ్‌­కు సీ­ని­య­ర్లు బరి­లో­కి ది­గ­ను­న్నా­రు.

Tags:    

Similar News