ఢిల్లీ క్రికెట్ బోర్డులో విభేదాలు.. బిషన్‌బేడీ రాజీనామా!

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అరడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీడీసీఏ నిర్ణయించింది.

Update: 2020-12-23 12:32 GMT

ఢిల్లీ క్రికెట్ లో బోర్డు (డీడీసీఏ)లో విభేదాలు మొదలయ్యాయి. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) అరడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీడీసీఏ నిర్ణయించింది. అయితే డీడీసీఏ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఇండియన్ మాజీ క్రికెటర్, స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడి(Bishan Singh Bedi )  బోర్డులో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా స్టేడియంలో ఓ స్టాండ్‌కు ఉన్న తన పేరును తొలగించాలని కోరారు. ఈ మేరకు అయన బోర్డుకి ఓ లేఖ కూడా రాశారు. బోర్డులో బంధుప్రీతితో పరిపాలన సాగుతుందని వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సేవలందించిన అరుణ్ జైట్లీ గత ఏడాది అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అంతకుముందు అయన 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం అయన కుమారుడు రోహన్ జైట్లీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. 

Tags:    

Similar News