IPL-2025లో GT జోరు కొనసాగుతోంది. ఈరోజు(సోమవారం) KKRతో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ ఓపెనర్లు గిల్(90) సాయి సుదర్శన్(52) చెలరేగి ఆడటంతో 198 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన KKR.. గుజరాత్ బౌలర్ల ధాటికి 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా ఇషాంత్, సిరాజ్, సాయి కిషోర్, సుందర్ ఒక్కో వికెట్ సాధించారు. కోల్‌కత్తా బ్యాటర్‌లలో స్కిప్పర్ అజింక్యా రహానే(50) మినహా ఎవరు పెద్దగా రాణించలేదు. వెంకటేష్ అయ్యర్(14), రింకు సింగ్(17), ఆండ్రూ రస్సెల్(21) మరోసారి నిరాశపరిచారు.