IPL: చెన్నై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు

Update: 2025-04-26 04:00 GMT

చెపాక్‌లో చెన్నైపై హైదరాబాద్‌ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ విజయంతో హైదరాబాద్‌ తన ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. హైదరాబాద్‌కు ఇది మూడో విజయం. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్‌ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. మరోవైపు చెన్నైకిది ఏడో ఓటమి. 9 మ్యాచ్‌ల్లో ఆజట్టు ఏడింట్లో ఓడింది. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలిచినా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు నామమాత్రమే. దీంతో సీఎస్కే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.

ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే..

IPL-2025ప్లే ఆఫ్‌కు చేరుకోవడానికి మిగిలిన 6 మ్యాచ్‌ల్లో GT, DC 2 మ్యాచ్‌లు గెలవాలి. RCB 5 మ్యాచ్‌ల్లో 2, PBKS 6 మ్యాచ్‌ల్లో 3, MI, LSG 5 మ్యాచ్‌ల్లో 3, KKR 6 మ్యాచ్‌ల్లో 5, SRH, CSK 6 మ్యాచ్‌ల్లో 6 గెలవాల్సిందే. RR జట్టు టెక్నీకల్‌గా ప్లే ఆఫ్‌కు చేరుకోలేదు.

Tags:    

Similar News