CSK Vs KKR: ఉత్కంఠ పోరులో చెన్నై విజయం..!
CSK Vs KKR: వరుస విజయాలతో దూసుపోతుంది చెన్నై జట్టు.. ఇప్పటికే రెండు విజయాలతో మంచి జోష్ మీద ఉన్న చెన్నై తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.;
CSK Vs KKR: వరుస విజయాలతో దూసుపోతుంది చెన్నై జట్టు.. ఇప్పటికే రెండు విజయాలతో మంచి జోష్ మీద ఉన్న చెన్నై తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఆఖరి బంతికి విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్(40), డుప్లెసిస్ (43) మంచి శుభారంభం అందించగా, మొయిన్ అలీ (35) ఫర్వాలేదనిపించాడు. రైనా(11),ధోనీ(1) త్వరగానే ఔటవడంతో చెన్నై కష్టాల్లో పడింది. చివర్లో జడేజా (22) మేరపు ఇన్నింగ్స్ ఆడి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. కాగా కోల్‌కతా బౌలర్లలో రసెల్, ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ, చక్రవర్తి, నరైన్ తలో వికెట్ తీశారు.