CLASH IN GROUND: జెంటిల్మెన్ గేమ్ అని మర్చిపోయారా..?
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో కొట్టుకున్న ఆటగాళ్లు... సౌత్ ఢిల్లీ- వెస్ట్ ఢిల్లీ ప్లేయర్స్ మధ్య గొడవ... మైదానంలోనే కొట్టుకున్న ప్లేయర్స్
ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) 2025 తుది దశకు చేరుకుంది. దాంతో మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. విజయమే లక్ష్యంగా ఆటగాళ్లు బరిలోకి దిగుతుండటంతో ఘర్షణ వాతావారణం నెలకొంటుంది. తాజాగా వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు ఇరు జట్లలోని మొత్తం ఐదుగురు ఆటగాళ్లకు భారీ జరిమానా విధించారు.
డీపీఎల్ 2025 నాకౌట్ దశకు చేరుకుంది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కొనసాగింది.. మొదట సౌత్ ఢిల్లీ బ్యాటింగ్‌కు వచ్చి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన వెస్ట్ ఢిల్లీకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. స్వల్ప స్కోర్ వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోయింది. ఇక, ఓపెనర్ క్రిష్ యాదవ్ (31), మయాంక్ గుసైన్ (15*)తో కలిసి నితీశ్ (134*: 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్స్‌లు)తో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచారు. నితీశ్ – క్రిష్ జోడీ మరింత దూకుడుగా ఆడుతున్న సమయంలో సౌత్ ఢిల్లీ బౌలర్ భార్తి ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలికి క్రిష్ యాదవ్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద అన్మోల్ శర్మ చేతికి చిక్కాడు. అప్పుడే బౌలర్ – బ్యాటర్ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది.. ఒకరినొకరు తొసేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వారిని సహచర ఆటగాళ్ల ఆపేందుకు ప్రయత్నించారు. కీలక వికెట్ పడటంతో సౌత్ ఢిల్లీ ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకోవడంతో.. డగౌట్‌కు వెళ్తున్న క్రిష్ యాదవ్ ఏవో కామెంట్స్ చేయడంతో మళ్లీ ఒక్కసారిగా కొట్టుకోవడంతో అంపైర్లు వారిని ఆపే ప్రయత్నం చేశారు.
భారీ జరిమానా
వాగ్వాదం తర్వాత నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీలకు భారీ జరిమానా విధించారు. ఈ సంఘటన శుక్రవారం జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ మధ్య జరిగింది. నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీలు ఇద్దరూ మైదానంలో గొడవ పడడం, ఒకరికొకరు సైగలు చేసుకోవడం వల్ల వారిపై జరిమానా విధించారు. మ్యాచ్ తర్వాత డీపీఎల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం.. నితీష్ రాణాతో గొడవ కారణంగా దిగ్వేష్ రాఠీకి 80 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. ఎనిమిదో ఓవర్లో నితీష్ రాణా దిగ్వేష్ వేసిన బంతులకు వరుసగా మూడు సిక్సర్లు కొట్టడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆర్టికల్ 2.2 కింద క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రాఠీపై 80 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించినట్లు పేర్కొంది.