IPL: ఉత్కంఠభరిత పోరులో లక్నో విజయం
పోరాడి ఓడిన రాజస్థాన్ రాయల్స్..... రెండు పరుగుల తేడాతో విజయం;
ఐపీఎల్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ఆఖరి ఓవర్ లో దోబూచులాడిన విజయం చివరికి లక్నో సూపర్ జెయింట్స్ ను వరించింది. 2 పరుగులు తేడాతో లక్నో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచు చివరి వరకూ ఉత్కంఠగా సాగి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్ లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం అవ్వగా, ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 పరుగులే ఇచ్చి హెట్మెయర్ (12) ను ఔట్ చేసి.. తమ జట్టుకు విజయాన్ని అందించాడు.
భారీ లక్ష్య ఛేదనలో..
181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (74), రియాన్ పరాగ్ (39), వైభవ్ సూర్యవంశీ (34) పరుగులు చేశారు. ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 పరుగులే ఇచ్చి హెట్‌మయర్ (12)ను ఔట్ చేశాడు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, శార్దూల్ ఠాకూర్, మార్‌క్రమ్ చెరో వికెట్ తీశారు.
మెరిసిన మార్క్రమ్
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ (66; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బదోని (50; 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు బాదారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ (30*; 10 బంతుల్లో) నాలుగు సిక్స్‌లు బాదడంతో స్కోరు 180కి చేరింది. మిచెల్ మార్ష్ (4), నికోలస్ పూరన్ (11), రిషభ్ పంత్ (3) విఫలమయ్యారు. ఈ క్రమంలో మార్‌క్రమ్, బదోని జోడీ నాలుగో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మార్‌క్రమ్ 31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న బదోని.. తర్వాత బంతికే అవుట్ అయ్యాడు