Anaya Bangar: స్టార్ క్రికెటర్లు వేధించారు

Update: 2025-04-18 09:45 GMT

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు స్టార్ క్రికెటర్ల నుంచి వేధింపులకు లోనవుతుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్‌ లింగమార్పిడి చేసుకొని ఆనయ బంగర్‌గా మారారు. దీంతో తోటి స్నేహితులతో పాటు క్రికెటర్ల నుంచి పలు వేదింపులు ఎదురుకున్నారు. దీంతో ఆమె తన మాకాన్ని లండన్‌కు మార్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వూలో పాల్గొన్నారు. 'మీరు లింగమార్పిడి చేసుకున్న తర్వాత ఎలాంటి ఒవేదింపులు ఎదురుకున్నారా' అని ప్రశ్నించగా ఆమె సమాధానమిస్తూ.. 'కొందరు క్రికెటర్లు అసభ్యకరమైన ఫొటోలు పంపేవారు. తరచూ ‘న్యూడ్‌’ ఫొటోలు పంపి వేధించేవారు. ఒకరు అందరి ముందు మద్దతుగా మాట్లాడేవాడు. ఎవరూ లేనప్పుడు మాత్రం తన పక్కనే కూర్చోమని నా ఫొటోలు పంపమని అడిగేవాడు. నేను భారత్‌లో ఉన్నప్పడు ఓ వెటరన్‌ క్రికెటర్‌కు నా పరిస్థితి గురించి చెప్పా. సరే పద కారులో వెళ్దామని చెప్పి.. ‘స్లీప్‌ విత్‌ మి’ అని అడిగాడు. ఇలాంటి పరిస్థితులతో తొలినాళ్లలో చాలా ఇబ్బందిపడ్డా' అని అన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Tags:    

Similar News