CSK: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో లుకలుకలు!
చెన్నై జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్ రిలీవ్.. జట్టులోని లుకలుకలే కారణమని ఆరోపణలు... త్వరలోనే అశ్విన్ విషయంలో చెన్నై నిర్ణయం;
చాలా ఏళ్ల తర్వాత ఈ సీజన్ ముంగిట తిరిగి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులోకి వచ్చిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆ జట్టుకు టాటా చెప్పబోతున్నట్లు సమాచారం. తనను జట్టు నుంచి విడుదల చేయాలంటూ చెన్నై ఫ్రాంచైజీని అశ్విన్ కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల నిలుపుదలకు మరో రెండు నెలలే గడువున్నందున జట్టులో తన పాత్ర గురించి సీఎస్కేతో అశ్విన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ‘‘ఇప్పుడే ఏ ఆటగాడి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేరు. నిలుపుదల గడువు తేదీని ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఇంకా సమయముంది. ఆటగాళ్లతో చర్చలు జరపడం వేలం పాటకు ముందస్తు ప్రణాళికే. సీనియర్ ఆటగాడు అశ్విన్‌తో చర్చలు ఇందులో భాగమే. వచ్చే సీజన్‌కు ముందు జట్టులో అతని పాత్రను అర్థం చేసుకునే పరస్పర చర్చ ఇది’’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 2025 సీజన్‌కు ముందు మెగా వేలం పాటలో రూ.9.75 కోట్లకు అశ్విన్‌ను చెన్నై కొనుక్కుంది. ఈ ఏడాది 9 మ్యాచ్‌లాడిన అశ్విన్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. 10 ఓటములు, 4 విజయాలతో పాయింట్ల పట్టికలో చెన్నై చిట్టచివరి స్థానంలో నిలిచింది. 2009 నుంచి 2015 వరకు చెన్నైకి అశ్విన్ ప్రాతినిధ్యం వహించాడు.
జట్టులో లుకలుకలు
చెన్నై సూపర్ కింగ్స్ లోనూ తలెత్తినట్లు కనిపిస్తోంది. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ త్వరలో ఆ ఫ్రాంచైజీతో తన బంధాన్ని తెంచుకోనున్నట్లు సమాచారం. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ నాటికి అతను ఈ ఫ్రాంఛైజీ నుండి వైదొలగనున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తోన్నాడు రవి అశ్విన్. ఐపీఎల్ 2026లో మరో ఫ్రాంచైజీలో చేరితే ఈ పదవికి కూడా గుడ్ బై చెప్పొచ్చని తెలుస్తోంది. అశ్విన్ తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎస్కే మేనేజ్మెంట్ కు తెలియజేశాడని సమాచారం.
సందిగ్దంలో చెన్నై
అశ్విన్ విషయంలో సీఎస్కే ఫ్రాంఛైజీ.. ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోతోంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కేప్టెన్ రుతురాజ్ గైక్వాడ్త సంప్రదింపులు జరుపుతోంది. ప్రత్యామ్నాయం ఎలా ఉండాలి? భవిష్యత్ వ్యూహాలేమిటనే విషయంపై వారితో చర్చిస్తోన్నట్లు చెబుతున్నారు. దీని తర్వాతే రవి అశ్విన్ అంశంపై తుదినిర్ణయానికి రావొచ్చు. ఈ ఐపీఎల్ సీజన్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాడు అశ్విన్. 9.75 కోట్ల రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. పదేళ్ల విరామం తర్వాత రెండోసారి అతను ఈ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సీజన్ లో పెద్దగా రాణించలేకపోయాడు.
చెన్నైకి మంచిదే
రవిచంద్రన్ అశ్విన్.. చెన్నై సూపర్‌కింగ్స్‌ను వీడనున్నాడని వార్తలు వస్తున్న వేళ టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ రకంగా చెన్నై జట్టుకు అదే మంచిదన్నాడు. అప్పుడే టీమ్‌ను యువకులతో పునర్నిర్మించడానికి అవకాశం ఏర్పడుతుందని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు. ఒక వేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రవిచంద్రన్ అశ్విన్‌ను వదులుకుంటే.. ఆ నిర్ణయానికి తన మద్దతు ఉంటుందని కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. 2025 సీజన్లో యువకులే టీమ్ తరఫున చక్కగా రాణించిన విషయాన్ని అతడు గుర్తు చేశాడు. ‘నిజానికి నేను చెన్నై సూపర్‌కింగ్స్‌కే మద్దతు తెలుపుతున్నా. ఒక వేళ వారు అశ్విన్‌ను వదులుకుంటే అది మంచి నిర్ణయం అవుతుంది.