BGT: ఆడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
రెండో ఇన్నింగ్స్ లో కేవలం 175 పరుగులకే భారత్ ఆలౌట్... 19 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించిన కంగారులు;
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 19 పరుగుల లక్ష్యాన్ని కేవలం.. 3.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ను భారత జట్టు 1-1 తేడాతో సిరీస్ ను సమం చేసింది. ఈ ఓటమితో భారత జట్టు 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్.. ఫైనల్ ర్యాంకును క్లిష్టతరం చేసుకుంది.
175 పరుగులకే ఆలౌట్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులకు ఆలౌటైంది. కేవలం భారత్ 18 పరుగుల లీడ్‌లో ఉంది. ఆసీస్ విజయ లక్ష్యం 19 పరుగులు. నితీశ్‌రెడ్డి 42, పంత్ 28, గిల్ 28 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2, బోలాండ్ 3 వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 337 పరుగులు చేసి ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(140)తో విజృంభిచగా ఆ జట్టు 157 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లు బూమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లు తీశారు.
రోహిత్ నిర్ణయం సరైనదేనా..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సాహాసోపేత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఓపెనింగ్ లో ఆడే రోహిత్, రెండో టెస్టు నుంచి మిడిలార్డర్ లో ఆడుతున్నాడు. అయితే, రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయంపై దిగ్గజ ఆటగాళ్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. రోహిత్ ఓపెనింగ్ లోనే బ్యాటింగ్ చేస్తే బాగుండేదని.. మిడిల్ ఆర్డర్ లో రోహిత్ ఇమడలేకపోతున్నాడని మాజీలు అంటున్నారు. అడిలైడ్ టెస్టులో రోహిత్ శర్మ.. మిడిలార్డర్లో ఆడటం కరెక్టు కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ అన్నాడు. రాహుల్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్ కాదని, తన కోసం రోహిత్ తన స్థానాన్ని వదులు కోవడం కరెక్టు కాదన్నాడు. రోహిత్ లాంటి దూకుడైన ప్లేయర్ ఆ స్థానంలో ఆడటం కరెక్టు కాదని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇప్పుడు రోహిత్ స్థానం మారడంతో అతడి కెరీరే ప్రమాదంలో పడిందని అభిప్రాయ పడ్డాడు.