DHONI: మహేంద్రుడిలో మరో కోణం!

ధోనీపై వరుసగా విమర్శలు చేస్తున్న మాజీలు... తన కెరీర్ నాశనం చేశాడని పఠాన్ విమర్శలు ## హుక్కా తాగలేదనే జట్టులో చోటివ్వలేదని వ్యాఖ్య

Update: 2025-09-04 06:32 GMT

మహేం­ద్ర­సిం­గ్ ధోనీ.. టీ­మిం­డి­యా సక్సె­స్‌­ఫు­ల్ కె­ప్టె­న్. సా­ర­ధి­గా ధో­నీ­ని మిం­చిన ప్లే­య­ర్ లే­డం­టే అతి­శ­యో­క్తి కాదు. భా­ర­త్‌­కు వన్డే ప్ర­పం­చ­క­ప్, టీ 20 ప్ర­పం­చ­క­ప్ అం­దిం­చి టె­స్టు­ల్లో టీ­మిం­డి­యా­ను నెం­బ­ర్ వన్‌­గా ని­లి­పిన కె­ప్టె­న్. ఐసీ­సీ ట్రో­ఫీ­ల్లో భా­ర­త్ తర­పున అత్యంత వి­జ­య­వం­త­మైన సా­ర­ధి­గా ధోనీ క్రి­కె­ట్ ప్ర­పం­చం­లో ఎన­లే­ని ఖ్యా­తి­ని ఆర్జిం­చా­డు. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ కు అయి­దు ఐపీ­ఎ­ల్ ట్రో­ఫీ­ల­ను అం­దిం­చా­డు. అయి­తే ఇటీ­వల ధో­నీ­పై వరు­స­గా వి­మ­ర్శ­లు వస్తు­న్నా­యి. మాజీ ఆట­గా­ళ్లు ధో­నీ­పై చే­స్తు­న్న వి­మ­ర్శ­లు... క్రి­కె­ట్ అభి­మా­ను­ల­ను షా­క్‌­కు గు­రి­చే­స్తు­న్నా­యి.

హుక్కా తాగడం వల్లే..

తన కె­రీ­ర్ పతనం వె­నుక ధోనీ హస్తం ఉం­ద­ని ఇర్ఫా­న్ పఠా­న్ చే­సిన వ్యా­ఖ్య­లు క్రి­కె­ట్ అభి­మా­నుల మధ్య చర్చ­కు దా­రి­తీ­స్తు­న్నా­యి. పఠా­న్ ధోనీ పే­రు­ను నే­రు­గా ప్ర­స్తా­విం­చ­న­ప్ప­టి­కీ, ఆయన వ్యా­ఖ్య­లు ధో­నీ­ని ఉద్దే­శిం­చే అన్నా­డ­ని స్ప­ష్టం­గా తె­లు­స్తోం­ది. “ఎవరి గది­లో­నో హు­క్కా ఏర్పా­టు చే­య­డం, దాని గు­రిం­చి మా­ట్లా­డ­టం నాకు అల­వా­టు లేదు. ఈ వి­ష­యం అం­ద­రి­కీ తె­లు­సు.” అని అన్నా­రు. హు­క్కా తా­గ­లే­ద­నే ఉద్దే­శం­తో పఠా­న్ ఈ వ్యా­ఖ్య­లు చే­శా­రు. అయి­తే ఈ వ్యా­ఖ్య­లు ధో­నీ­ని లక్ష్యం­గా చే­సు­కు­ని చే­సి­న­ట్లు­గా భా­వి­స్తు­న్నా­రు. ఎం­దు­కం­టే, గతం­లో ధోనీ హు­క్కా తా­గు­తు­న్న వీ­డి­యో­లు వై­ర­ల్ అయిన సం­ద­ర్భా­లు ఉన్నా­యి. ఆస్ట్రే­లి­యా మాజీ క్రి­కె­ట­ర్ జా­ర్జ్ బె­యి­లీ కూడా ఒక ఇం­ట­ర్వ్యూ­లో ధోనీ సహచర ఆట­గా­ళ్ల­తో అప్పు­డ­ప్పు­డు హు­క్కా తా­గు­తా­ర­ని తె­లి­పా­రు. ఈ నే­ప­థ్యం­లో, హు­క్కా తాగే ఆట­గా­ళ్ల­కే ధోనీ జట్టు­లో ప్రా­ధా­న్యత ఇచ్చే­వా­ర­నే ప్ర­చా­రం జరుగుతోంది. ఈ వ్యా­ఖ్యల వల్ల ఇర్ఫా­న్ పఠా­న్ కె­రీ­ర్ అద్భు­తం­గా ఉన్న సమ­యం­లో­నే ము­గి­సి­పో­యిం­ద­ని, మంచి ప్ర­ద­ర్శన చే­సి­నా జట్టు­లో చోటు దక్క­లే­ద­ని అభి­మా­ను­లు అం­టు­న్నా­రు.

ధోనీపై సెహ్వాగ్ కామెంట్స్

2011 వన్డే ప్ర­పం­చ­క­ప్‌­న­కు ముం­దు వన్డే క్రి­కె­ట్ నుం­చి రి­టై­ర్ కా­వా­ల­ని సె­హ్వా­గ్ భా­విం­చా­డు. అం­దు­కు కా­ర­ణం అప్ప­టి కె­ప్టె­న్ ఎం­ఎ­స్ ధోనీ అని తా­జా­గా సె­హ్వా­గ్ తె­లి­పా­డు. 2008 కా­మ­న్వె­ల్త్ బ్యాం­క్ సి­రీ­స్‌­లో తాను వి­ఫ­ల­మై­న­ప్పు­డు ధోనీ తనను పక్కన పె­ట్టా­డ­ని సె­హ్వా­గ్ తె­లి­పా­డు. ధోనీ తనను తుది జట్టు నుం­చి తొ­ల­గిం­చ­డం­తో సె­హ్వా­గ్ రి­టై­ర్ అవ్వా­ల­ని భా­విం­చా­డట.

ధోనీ నన్ను తిట్టాడు

ధోని తనను తి­ట్టా­డ­ని బౌ­ల­ర్ మో­హి­త్ శర్మ ఇటీ­వల తె­లి­పా­డు. ఛాం­పి­య­న్స్ లీగ్ టీ20 మ్యా­చ్‌­లో ధోనీ కో­పం­తో తనను తి­ట్టా­డ­ని తె­లి­పా­డు. అయి­తే ధో­నీ­తో ఎన్నో మధుర జ్ఞా­ప­కా­లు ఉన్నా­య­ని మో­హి­త్ వి­వ­రిం­చా­డు. యువరాజ్ సింగ్‌, క్రికెట్ లెజెండ్ కాకుండా రిటైర్మెంట్ తీసుకోవడానికి ధోనీయే కారణమని చాలా సార్లు ఆరోపించాడు యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. మాహీపై ఆరోపణలు చేశాడు.

Tags:    

Similar News