DHONI: టీమిండియా మెంటార్‌గా మహేంద్రుడు!
ధోనీకి బీసీసీఐ బిగ్ స్పెషల్ ఆఫర్... కొత్త రూల్‌లో మిస్టర్ కూల్ ధోనీ.!... తలా అంగీకరిస్తాడా లేదా అన్న ఉత్కంఠ
టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బీసీసీఐ కొత్త బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026 టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్లో కీలక రోల్ ఇవ్వాలని బోర్డు యోచిస్తుందట. ఈ మేరకు కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ధోనీ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2020లోనే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, ప్రస్తుతం ఐపీఎల్‌లోనే ఆడుతున్నాడు. అయితే 2026 ఎడిషన్‌లో ఆడుతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో బోర్డు ధోనికి స్పెషల్ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. 2026 పొట్టి ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ధోనీని టీమ్ఇండియా మెంటార్‌గా నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ధోనీని మళ్లీ టీమ్ఇండియా డగౌట్లో మన ప్లేయర్లతో కలిసి చూడవచ్చు.
తలా మళ్లీ తిరిగొస్తాడా..?
అయితే ఇప్పుడు మరోమారు ధోని సేవలను ఉపయోగించుకోవాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నరంట. క్రిక్‌బ్లాగర్ రిపోర్ట్ ప్రకారం.. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ధోని కీలక పాత్ర పోషిస్తాడని బోర్డు విశ్వసిస్తన్నట్లు సమాచారం. అతడి సేవలను సుదీర్ఘంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరించే అవకాశం లేదని సదరు నివేదిక పేర్కొంది. అందుకు కారణం ధోని, గంభీర్ మధ్య ఉన్న వైర్యమే. ఒకవేళ ధోని ఒప్పుకొన్న గంభీర్ అందుకే ఓకే అంటాడన్నది అనుమానమే. ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు భారత జట్టుకు కలిసి ఆడినప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి. ధోని కెప్టెన్సీలో గెలిచిన టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్ జట్లలో గంభీర్ సభ్యునిగా ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2011 ఫైనల్లోనూ గౌతీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ క్రెడిట్ అంతా కెప్టెన్‌గా ధోని ఇచ్చారని, అది సరికాదంటూ చాలా సందర్భాల్లో గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి పోయారని, కచ్చితంగా ధోని రాకను గంభీర్ స్వాగతిస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మరి కొద్ది రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
గంభీర్ ఒప్పుకుంటాడా..?
2021 టీ20 ప్రపంచకప్ సమయంలో ధోనీని బీసీసీఐ మెంటార్‌గా నియమించుకుంది. కేవలం ఆ టోర్నీ వరకే సేవలు అందించేలా ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ధోనీకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఈసారి మాత్రం అలా షార్ట్‌టర్మ్ కాకుండా.. భవిష్యత్తును దృష్టిలోఉంచుకొని అతడి చురుకైన వ్యూహాలను సుదీర్ఘంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. మెంటార్‌గా ధోనీ విషయంలో అతడు సానుకూలంగా ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ధోనీ నాయకత్వంలో గెలిచిన వన్డే, టీ20 ప్రపంచకప్ జట్లలో గంభీర్ కూడా సభ్యుడే. అప్పుడు క్రెడిట్ అంతా సారథిగా ధోనీకి ఇవ్వడం సరికాదంటూ ఆ తర్వాత చాలా సందర్భాల్లో గంభీర్ వ్యాఖ్యానించాడు. ధోనీ వంటి దిగ్గజ క్రికెటర్‌ను తనకంటే కాస్త పైపదవిలో ఉంచేందుకు ఇష్టపడతాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.