MS DHONI: మహేంద్రుడి మాయాజలం లేకపోతే గెలవలేదా?

రెండు మ్యాచుల్లో ఓడిపోయిన చెన్నై .. ధోనీ లేక చతికిలపడుతున్న సూపర్ కింగ్స్... పూర్తిగా చేతులెత్తేసిన బ్యాటర్లు, బౌలర్లు

Update: 2026-04-09 04:00 GMT

ఐపీ­ఎ­ల్ 2026 సీ­జ­న్ ప్రా­రం­భం­లో­నే చె­న్నై­కు ఊహిం­చ­ని ఎదు­రు­దె­బ్బ తగి­లిం­ది. ఎన్నో వి­జ­యా­ల­తో చరి­త్ర సృ­ష్టిం­చిన ఈ జట్టు, ఈసా­రి తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరా­జ­యా­న్ని చవి­చూ­డ­టం అభి­మా­ను­ల­ను ని­రా­శ­కు గు­రి­చే­సిం­ది. ము­ఖ్యం­గా జట్టు­కు ఎన్నో సం­వ­త్స­రా­లు­గా బలం­గా ని­లి­చిన కె­ప్టె­న్ ఎం­ఎం­స్ ధోనీ గై­ర్హా­జ­రీ ఈ మ్యా­చ్‌­లో స్ప­ష్టం­గా కని­పిం­చిం­ది. గాయం కా­ర­ణం­గా ధోని ఇంకా కో­లు­కుం­టుం­డ­టం­తో ఆయన లే­కుం­డా­నే బరి­లో­కి ది­గిన చె­న్నై జట్టు, రా­జ­స్థా­న్, రాయల్ ఛాలేంజర్స్ బెంగళూరు చే­తి­లో పూ­ర్తి­గా తే­లి­పో­యిం­ది. మ్యా­చ్‌­లో తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన చె­న్నై జట్టు ఆరం­భం నుం­చే కష్టా­ల్లో పడిం­ది. రా­జ­స్థా­న్ బౌ­ల­ర్లు కట్టు­ది­ట్టం­గా బౌ­లిం­గ్ చే­య­డం­తో చె­న్నై బ్యా­ట­ర్లు ఒక్క­రై­నా ని­ల­దొ­క్కు­కో­లే­క­పో­యా­రు. కీలక ఆట­గా­ళ్లు­గా భా­విం­చిన రు­తు­రా­జ్ గై­క్వా­డ్ వంటి వారు ఆశిం­చిన ప్ర­ద­ర్శన ఇవ్వ­లే­క­పో­యా­రు. ఫలి­తం­గా చె­న్నై జట్టు 19.4 ఓవ­ర్ల­లో కే­వ­లం 127 పరు­గు­ల­కే ఆలౌ­ట్ అయిం­ది. ఇక బెంగళూరుతో జరిగిన మ్యాచులో చెన్నై బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. బౌలింగ్లో వ్యూహాలు అమలు చేయలేకో పూర్తిగా చతికిలపడ్డారు.

 మరీ ఇంత బలహీనమా..

చి­న్న లక్ష్యా­న్ని చే­ధిం­చేం­దు­కు బరి­లో­కి ది­గిన రా­జ­స్థా­న్ రా­య­ల్స్ మా­త్రం ఎక్క­డా ఒత్తి­డి­కి లో­న­వ్వ­లే­దు. యువ ఆట­గా­ళ్లు యశ­స్వీ వై­భ­వ్ సూ­ర్య­వం­శీ దూ­కు­డు­గా ఆడు­తూ చె­న్నై బౌ­ల­ర్ల­పై ఆధి­ప­త్యం చా­టా­రు. కే­వ­లం 13 ఓవ­ర్ల­లో­నే లక్ష్యా­న్ని చే­రు­కు­ని, 8 వి­కె­ట్ల తే­డా­తో వి­జ­యం సా­ధిం­చా­రు. ఈ వి­జ­యం ఎంత సు­ల­భం­గా సా­ధిం­చా­రో చూ­స్తే చె­న్నై బౌ­లిం­గ్ ఎంత బల­హీ­నం­గా మా­రిం­దో అర్థ­మ­వు­తుం­ది. ఈ పరా­జ­యం చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ ఐపీ­ఎ­ల్ చరి­త్ర­లో­నే అత్యంత భారీ ఓట­ము­ల్లో ఒక­టి­గా నమో­దైం­ది. ము­ఖ్యం­గా మి­గి­లిన బం­తుల పరం­గా చూ­స్తే, గతం­లో కోల్ కత్తా చే­తి­లో ఎదు­రైన ఓటమి తర్వాత ఇదే రెం­డో అతి­పె­ద్ద పరా­జ­యం­గా ని­లి­చిం­ది.

జట్టు­లో అను­భ­వ­జ్ఞు­డైన ధోని లే­క­పో­వ­డం ఎంత పె­ద్ద లోటో ఈ మ్యా­చ్ స్ప­ష్టం­గా చూ­పిం­చిం­ది. మ్యా­చ్ పరి­స్థి­తు­ల­ను అం­చ­నా వేసి జట్టు­ను సమ­తూ­కం­గా నడి­పిం­చే నా­య­క­త్వం లే­క­పో­వ­డం, ఒత్తి­డి­ని ఎదు­ర్కొ­నే సా­మ­ర్థ్యం తగ్గి­పో­వ­డం వంటి అం­శా­లు స్ప­ష్టం­గా బయ­ట­ప­డ్డా­యి. సో­ష­ల్ మీ­డి­యా­లో అభి­మా­ను­లు కూడా ఇదే వి­ష­యా­న్ని ప్ర­స్తా­వి­స్తూ, ధోని లే­క­పో­వ­డ­మే ఓట­మి­కి ప్ర­ధాన కా­ర­ణ­మ­ని అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. అయి­తే టో­ర్నీ ఇప్పు­డే ప్రా­రం­భ­మైం­ద­ని, ఒకే మ్యా­చ్ ఆధా­రం­గా జట్టు­ను అం­చ­నా వే­య­డం సరి­కా­ద­ని వి­శ్లే­ష­కు­లు సూ­చి­స్తు­న్నా­రు. ముం­దు­న్న మ్యా­చ్‌­ల్లో చె­న్నై జట్టు తప్పి­దా­ల­ను సరి­ది­ద్దు­కు­ని తి­రి­గి బలం­గా రా­ణిం­చే అవ­కా­శం ఉం­ద­ని భా­వి­స్తు­న్నా­రు. అభి­మా­ను­లు కూడా తమ జట్టు త్వ­ర­గా పుం­జు­కు­ని వి­జ­యం సా­ధిం­చా­ల­ని ఆశి­స్తు­న్నా­రు. మ్యా­చ్ చె­న్నై ­కు గట్టి హె­చ్చ­రి­క­గా ని­లి­చిం­ది. ము­ఖ్యం­గా జట్టు­లో నా­య­క­త్వం, అను­భ­వం ఎంత కీ­ల­క­మో మరో­సా­రి రు­జు­వైం­ది. ధోని మళ్లీ జట్టు­లో చే­రిన తర్వాత చె­న్నై ఎలా పుం­జు­కుం­టుం­దో అన్న­ది ఇప్పు­డు అం­ద­రి దృ­ష్టి­ని ఆక­ర్షి­స్తోం­ది. మ్యా­చ్ అనం­త­రం రు­తు­రా­జ్ మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ.. ‘మ్యా­చ్ ఓటమి మాకు పె­ద్ద­గా ని­రాశ కలి­గిం­చ­లే­దు. అయి­తే మా ఇన్నిం­గ్స్ ఆరం­భం­లో రా­జ­స్థా­న్ రా­య­ల్స్ బౌ­ల­ర్లు జో­ఫ్రా ఆర్చ­ర్‌, నం­డ్రీ బర్గ­ర్‌­లు బౌ­లిం­గ్ చే­స్తు­న్న­ప్పు­డు పరి­స్థి­తు­లు కఠి­నం­గా ఉన్నా­య­ని­పిం­చిం­ది. రా­జ­స్థా­న్ బౌ­ల­ర్లు లైన్ అండ్ లెం­గ్త్‌­తో బం­తు­లు వే­శా­రు. ఇన్నిం­గ్స్ ఆరం­భం­లో పే­స­ర్లు, మధ్య­లో స్పి­న్న­ర్ల­కు పిచ్ సహ­క­రిం­చి­న­ట్లు అని­పిం­చిం­ది. వరుస ఓట­ము­ల­తో చె­న్నై అభి­మా­ను­లు ని­రా­శ­లో ఉన్నా­రు. ధోనీ వస్తే­నే చె­న్నై వి­జ­యాల బాట పట్టే అవ­కా­శం ఉంది.

Tags:    

Similar News