DULEEP TROPHY: తిరుగులేని కెప్టెన్.. రజత్ పటీదార్
కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్సీ మాయ... 11 ఏళ్ల తర్వాత సెంట్రల్ జోన్‌కు టైటిల్... సౌత్ జోన్‌ను చిత్తు చేసిన పాటిదార్ సేన
టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్ తన కెప్టెన్సీ సత్తా చూపాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపిన పటీదార్.. దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2025లో సెంట్రల్ జోన్‌కు టైటిల్ అందించాడు. ఫైనల్లో సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ 3 వికెట్ల కోల్పోయి ఛేదించింది. పటీదార్ నాయకత్వంలో వరుసగా రెండో టైటిల్‌ను సెంట్రల్ జోన్ గెలిచింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో మ్యాచ్ జరగగా.. యశ్ రాథోడ్ (194) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సెంట్రల్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సారాన్ష్ జైన్ 5, కుమార్ కార్తికేయ 4 దెబ్బకు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్. ఆపై సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 511 రన్స్ చేసింది. యశ్ రాథోడ్ (194) భారీ సెంచరీ చేయగా.. రజత్ పటీదార్ (101) శతకం బాదాడు. అంకిత్ శర్మ 4, గుర్జప్నీత్ సింగ్ 4 వికెట్స్ తీశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది.
11 ఏళ్ల నిరీక్షణకు తెర
రజత్ పాటిదార్ సారథ్యంలోని సెంట్రల్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్‌ను ముద్దాడింది. ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌత్ జోన్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించిన పాటిదార్.. తన మార్క్ కెప్టెన్సీతో సెంట్రల్ కలను సాకారం చేశాడు. బెంగళూరు మైదానంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్ ఉత్కంఠ విజయంతో మురిసింది. ఒకదశలో ఓటమి అంచున నిలిచిన ఆ జట్టు.. చిరస్మరణీయ విక్టరీ సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సెంట్రల్ బౌలర్లు సరన్ష్ జైన్(5-49), కుమార్ కార్తికేయ(4-53) ధాటికి ఆ జట్టు 149 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జట్టు 511 పరుగులతో భారీ ఆధిక్యం సాధించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ బ్యాటర్లు అసమానంగా ఆడారు. అంకిత్ శర్మ(99), అండ్రే సిద్దార్థ్ (84), స్మరణ్ రవిచంద్రన్ (67)లు అర్ధ శతకాలతో విజృంభించారు. దాంతో.. 426 రన్స్ చేసిన సౌత్ ప్రత్యర్థికి 65 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 362 పరుగులు వెనకబడిన సౌత్ జోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేయగలిగింది. అంకిత్ శర్మ (99), స్మరన్ రవిచంద్రన్ (67), ఆండ్రూ సిద్దార్థ్ (84) హాఫ్ సెంచరీలు బాదారు. రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్భారీ స్కోర్ చేసినా.. సెంట్రల్ జోన్ ముందు 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. స్వల్ప లక్షాన్ని సెంట్రల్ జోన్ 20.3 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది.
తిరుగులేని కెప్టెన్
2025లో టీమిండియా స్టార్ ప్లేయర్ రజత్ పటీదార్.. కెప్టెన్‌గా అదరగొట్టాడు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆర్సీబీ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. తాజాగా దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ కైవసం చేశాడు.