ENG vs IND: జడేజా, సుందర్ వీరోచిత పోరాటం
ఇంగ్లాండ్ నాలుగో టెస్టు డ్రా ... అద్భుతంగా పోరాడిన జడేజా, సుందర్, గిల్... వీరోచిత శతకాలతో పోరాడిన బ్యాటర్స్;
మాంచెస్టర్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, గిల్ శతకాలతో భారత్ను ఓటమి నుంచి తప్పించారు. ఈ ముగ్గురి శతకాలతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (238 బాల్స్‌లో 12 ఫోర్లతో 103), రవీంద్ర జడేజా (185 బాల్స్‌లో 13 ఫోర్లతో 1 సిక్స్‌తో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (206 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్) వీరోచిత సెంచరీలకు తోడు కేఎల్ రాహుల్ (230 బాల్స్‌లో 8 ఫోర్లతో 90) పోరాడటంతో.. 174/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఇండియా మ్యాచ్ చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 143 ఓవర్లలో 425/4 స్కోరు చేసింది. భారత్ రెం- డవ ఇన్నింగ్స్లో జడేజా, వాషింగ్టన్ సుందర్, శుభ్ మన్ గిల్ సెంచరీలతో మెరిశారు. జడేజా.. ఇంగ్లాండ్లో 1000 టెస్ట్ పరుగులు కూడా పూర్తి చేశాడు. భారత ఆల్ రౌండర్ ఇంగ్లాండ్లో 30 టెస్ట్ వికెట్లు కూడా పడగొ- ట్టాడు. ఈ విధంగా, విదేశీ గడ్డపై 1000 పరుగులు, 30 వికెట్లు తీసిన తొలి భారతీయ ఆటగాడిగా జడేజా నిలిచాడు. 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, మరే ఇతర భారతీయ ఆల్ రౌండర్ ఈ ఘనతను సాధించలేకపోయాడు.
నిలిచిన గిల్
డ్రా కోసం ఆడాల్సిన చివరి ఇన్నింగ్స్లో టీమిండియా ఆరంభంలోనే 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కేఎల్ రాహుల్ తో కలిసి కెప్టెన్ గిల్ మ్యాచ్ను నిలబెట్టాడు. ఐదో రోజు అద్భుతమైన సెంచరీతో అదర- - గొట్టాడు. శుభమన్ గిల్ 103 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలోనే డాన్ బ్రాడ్మాన్, సునీల్ గవా- స్కర్ల దిగ్గజ విజయాలను సమం చేస్తూ ఒకే సిరీస్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ టెస్ట్ కెప్టెన్గా శుభమాన్ గిల్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నా- డు. భారత 37వ టెస్ట్ కెప్టెన్ గా ఎంపికైన గిల్ కెప్టెన్గా, బ్యాటర్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. జూన్ 20న హెడింగ్లీలో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో కెప్టెన్గా అరంగేట్రం చేసిన అతను, లీడ్స్- లో 147 పరుగులతో సిరీస్ ను ప్రారంభించాడు.
గోడ కట్టిన జడేజా, సుందర్
గిల్ అవుటైన తర్వాత ఇంగ్లాండ్కు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుం- దర్ అడ్డుగోడలా నిలిచారు. ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లుతూ అద్భుత ఇన్నింగ్స్ లు ఆడారు. ఇంగ్లాండ్ బౌల-ర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు బ్యాటర్లు సెంచరీ-లు చేసి భారత్కు డ్రాను అందించారు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు నిరాశను మిగిల్చారు. జడీ- జా, సుందర్ విరోచిత పోరాటంతో బ్రిటీష్ జట్టుకు విజయం దూరమైంది. స్టోక్స్ ఎన్ని రకాల వ్యూహాలు పన్నినా, బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అద్భుతమైన డిఫెన్స్‌తో జడ్డూ–సుందర్ జోడీ అడ్డుగోడ కట్టింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు ఒక్క రివ్యూ చాన్స్ కూడా ఇవ్వలేదు. ఇక బ్రూక్ బౌలింగ్‌లో సిక్స్‌తో 182 బాల్స్‌లో జడేజా సెంచరీ చేశాడు. ఈ మ్యాచు డ్రాగా ముగియడంతో సి- రీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భారత్ చూస్తోంది. వోక్స్ 2, ఆర్చర్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు.