England vs India 2nd test: లార్డ్స్‌లో భారత్ జయభేరి

England vs India 2nd test: ఇంగ్లాండ్ తో జరుగిన రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది

Update: 2021-08-17 01:43 GMT

England vs India: లార్డ్స్‌ వేదికగా ఆతిధ్య ఇంగ్లాండ్ తో జరుగిన రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. రెండో టెస్టులో భారత్‌ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో ఆఖరి రోజు మొదట టీమిండియా బౌలర్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచులో విజయంగా మలిచారు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 181/6తో సోమవారం ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్ రిషభ్‌ పంత్‌ (22) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాంత్‌ (16) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో షమీ–బుమ్రా భాగస్వామ్యం భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. షమీ (70 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) ఆదుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో 109.3 ఓవర్లలో 8 వికెట్లకు భారత్ 298పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది.

టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యం చేధించేందుకు ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. రెండు సెషన్లు, 60 ఓవర్లు మాత్రమే ఉండటంతో ఓవర్ కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఓవర్లలోనే బర్న్స్‌ (0), సిబ్లీ (0)లను పరుగులేమి చేయకుండా ఔటయ్యారు. ఇషాంత్‌, సిరాజ్ కూడా ఇంగ్లాండ్ ను కోలుకోనియలేదు. హమీద్‌ (9), బెయిర్‌ స్టో (2)ల పనిపట్టాడు ఇషాంత్. కెప్టెన్‌ రూట్‌ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును నడిపించాలని చూశాడు. అయితే బూమ్రా అవకాశం అతనికి ఇవ్వలేదు. సిరాజ్‌ వరుస బంతుల్లో బట్లర్‌ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) మొయిన్‌ అలీ (13), స్యామ్‌ కరన్‌ (0)లను ఔట్‌ చేశాడు.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్‌ చేతిలో 3 వికెట్లు ఉండటంతో డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్‌ (9)ను అవుట్‌ చేసి బుమ్రా బాట వేయగా...ఒకే ఓవర్లో బట్లర్‌ (25), అండర్సన్‌ (0)లను పెవిలియన్‌ పంపించి సిరాజ్‌ ముగించాడు. 

Tags:    

Similar News