KANERIA: ఉగ్రదాడికి మా దేశం మద్ధతు
పాక్ మాజీ క్రికెటర్ డానిష్ క్రికెటర్ సంచలన ఆరోణలు;
పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై విమర్శల జడివాన కురుస్తోంది. ఉగ్రవాదులను ‘స్వాతంత్ర్య సమరయోధులు’ అంటూ ఇషాక్ దార్ పిచ్చిపిచ్చిగా మాడ్లాడాడు. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్రంగా మండిపడ్డాడు. ఉగ్రవాదులను ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ పాకిస్థాన్ ఉప ప్రధాని పిచ్చిగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది పాకిస్థాన్ కు అవమానకరమే కాకుండా.. ఉగ్రవాదానికి తాము మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించినట్లు అయిందని అన్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదులను కాపాడటంతోపాటు ఆశ్రయం కల్పించడంపై డానిష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు.
పాక్ ప్రజలకు వ్యతిరేకం కాదు
తాను పాక్ లేదా ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లేదని కూడా కనేరియా స్పష్టం చేశాడు. పాక్ ఉప ప్రధాని పిచ్చి మాటలను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశాడు. ఉగ్రవాదం చేతిలో పాక్ తీవ్రంగా బాధపడుతోందని... శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం పాక్ కు ఉందని కనేరియా తెలిపాడు. తాను చాలా గర్వంగా పాక్ క్రికెట్ జెర్సీని ధరించానని... మైదానంలో తన చెమటను చిందించానని... చివరికి తనను ట్రీట్ చేసిన విధానం కూడా పహల్గాం బాధితులకు భిన్నంగా లేదని కనేరియా అన్నాడు. హిందువుగా ఉన్నందుకే తాను లక్ష్యంగా మారానని ఆవేదన వ్యక్తం చేశాడు. "ఉగ్రవాదాన్ని సమర్థించేవారు సిగ్గుపడాలి. హంతకులను రక్షించేవారు సిగ్గుపడాలి." అని కనేరియా సుదీర్ఘ పోస్టు పెట్టాడు.