GILL: గిల్ మరో ధోనీ కావడం ఖాయం!
గిల్ సారథ్యంపై ప్రశంసల వర్షం.. ఒత్తిడిలోనూ అద్భుత బ్యాటింగ్.. దూకుడు, ప్రశాంతతతో గిల్;
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అరంగేట్రం అదిరింది. మంచి కెప్టెన్సీ స్కిల్స్, అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం డేవిడ్ గోవర్ కూడా గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. గేమ్‌లో అతడి మెచ్యూరిటీ, కూల్ ఆట్టిట్యూడ్ సూపర్ అన్నాడు. అయితే, వరల్డ్ క్లాస్ కెప్టెన్ అవ్వాలంటే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నుంచి ఒక క్వాలిటీని నేర్చుకోవాలని కీలక సలహా ఇచ్చాడు. అదే, మ్యాచ్‌ను గెలిపించే పట్టుదల.
ఫస్ట్ సిరీస్‌లోనే గిల్ రికార్డులు
కేవలం 24 ఏళ్లకే గిల్‌కు కెప్టెన్సీ దక్కింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీఒకేసారి రిటైర్ అవ్వడం, జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా అందుబాటులో లేకపోవడంతో వంటి సవాళ్లు అతడికి స్వాగతం పలికాయి. టీమ్‌లో ఇతర సీనియర్లు ఉన్నా, మేనేజ్మెంట్ గిల్‌పైనే నమ్మకం ఉంచింది. ఈ ఒత్తిడిని తట్టుకొని, గిల్ బ్యాట్‌తో పాటు ఫీల్డ్‌లో తన కెప్టెన్సీతో కూడా అదరగొట్టాడు. సచిన్- అండర్సన్ సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లోనే 101.17 యావరేజ్‌తో 607 రన్స్ చేశాడు. ఇందులో హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్‌లో చేసిన సెంచరీలు కూడా ఉన్నాయి. "కెప్టెన్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదు. టాలెంట్, స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉంటే 24 ఏళ్ల కుర్రాడైనా టీమ్‌ను నడిపించగలడు" అని గోవర్ 'స్పోర్ట్‌స్టార్'తో అన్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్స్ లేకపోయినా, గిల్ తన కూల్ టెంపర్మెంట్, సాలిడ్ టెక్నిక్‌తో జట్టును పోటీలో నిలబెట్టాడని మెచ్చుకున్నాడు. కెప్టెన్సీ అంటే కేవలం రన్స్ చేయడం కాదని, టఫ్ సిట్యువేషన్స్‌లో టీమ్‌ను గెలిపించడం కూడా అని గోవర్ గుర్తుచేశాడు.
కిర్‌స్టెన్ కీలక కామెంట్స్
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, గ్యారీ కిర్‌స్టన్ మాట్లాడుతూ, "ఇది ఇప్పటికీ ప్రారంభం మాత్రమే అని అన్నారు. అతనికి అపారమైన సామర్థ్యం ఉందని నేను భావిస్తున్నాను. కెప్టెన్సీలో, మీరు చాలా విషయాలను కలిపి ఉంచుకోవాలి. అతను ఆటలో గొప్ప ఆలోచనాపరుడు. అతను స్వయంగా మంచి ఆటగాడు. కానీ మీరు చాలా విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మ్యాన్ మేనేజ్మెంట్ కూడా ఏ కెప్టెన్‌లాగే పనిచేస్తుందని నేను భావిస్తున్నాను." అని కిర్ స్టెన్ వెల్లడించాడు. 28 సంవత్సరాల తర్వాత భారత్‌ను వన్డే ప్రపంచ కప్ గెలిపించేలా గ్యారీ చేశాడు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని. అతను చాలా సంవత్సరాలుగా ధోనితో కలిసి భారత జట్టుకు పనిచేశాడు. ధోని నుండి గిల్ ఒక గుణాన్ని నేర్చుకోవచ్చని కిర్‌స్టన్ సలహా ఇచ్చాడు. ధోని అద్భుతమైన మ్యాన్-మేనేజర్. అతను తన నాయకత్వ సామర్థ్యంలోని ఈ అంశాన్ని పూర్తిగా మెరుగుపరుచుకోగలిగితే, గొప్ప కెప్టెన్ కావడానికి అతనికి అన్ని లక్షణాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను.