బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయామని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. పెర్త్ వేదికగా ఆదివారం ఆసీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. వరుణుడు పలు మార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో టీమ్ఇండియా 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) లు రాణించారు. విరాట్ కోహ్లీ (0), రోహిత్ శర్మ (8), శ్రేయస్ అయ్యర్ (11), శుభ్‌మన్ గిల్ (10) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, వోవెన్, కునెమన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా స్టార్క్, ఎలిస్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ అనంతరం ఓటమి పై శుభ్‌మన్ గిల్ స్పందించాడు. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడంతో తిరిగి పుంజుకోలేకపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. వర్షం అంతరాయం కలిగించిన ఇలాంటి మ్యాచ్‌ల్లో ఆటడం సవాల్‌తో కూడుకున్నదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన్పపటి కూడా చాలా విషయాలను నేర్చుకున్నట్లుగా తెలిపాడు. 131 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోనేందుకు బౌలర్లు చాలా ప్రయత్నించారన్నాడు. సాధ్యమైనంత చివరి వరకు మ్యాచ్‌కు తీసుకువెళ్లారని, బౌలర్లను అభినందిస్తున్నట్లు చెప్పాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 21.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (46*) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఫిలిప్పే (37) ఆకట్టుకున్నాడు. రెన్ షా (21*) పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8)పరుగులకే ఔట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్లలో అర్షదీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఇక రెండో వన్డే గురువారం జరగనుంది.