CHAMPIONS: మన కుర్రాళ్లు విశ్వ విజేతలు

అండర్-19 వరల్డ్‌కప్ 2026లో భారత్ ఛాంపియన్... ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 100 పరుగుల విజయం... ఆరోసారి అండర్-19 భారత్ వరల్డ్‌కప్ టైటిల్

Update: 2026-02-07 03:00 GMT

గతే­డా­ది భారత మహి­ళల జట్లు వన్డే వర­ల్డ్‌­క­ప్, అం­ధుల ప్ర­పం­చ­క­ప్‌ గె­లి­స్తే.. కొ­త్త ఏడా­ది­లో కు­ర్రా­ళ్లు అద­ర­గొ­ట్టా­రు. స్ఫూ­ర్తి­దా­యక ప్ర­ద­ర్శ­న­తో అం­డ­ర్‌-19 ప్ర­పం­చ­క­ప్‌­ను కై­వ­సం చే­సు­కు­న్నా­రు. శు­క్ర­వా­రం జరి­గిన ఫై­న­ల్లో భా­ర­త్‌ 100 పరు­గుల తే­డా­తో ఇం­గ్లాం­డ్‌­ను చి­త్తు చే­సిం­ది. వై­భ­వ్‌ సూ­ర్య­వం­శీ (175; 80 బం­తు­ల్లో 15×4, 15×6) వి­ధ్వం­సక శత­కం­తో మొదట భా­ర­త్‌ 50 ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల­కు 411 పరు­గుల భారీ స్కో­రు చే­సిం­ది. ఛే­ద­న­లో ఇం­గ్లాం­డ్‌ 40.2 ఓవ­ర్ల­లో 311 పరు­గు­ల­కే ఆలౌ­టైం­ది. అం­డ­ర్‌-19 ప్ర­పం­చ­క­ప్‌ గె­ల­వ­డం భా­ర­త్‌­కు ఇది ఆరో­సా­రి. జిం­బా­బ్వే రా­జ­ధా­ని హరా­రే­లో జరి­గిన ఫై­న­ల్ మ్యా­చ్‌­లో, భా­ర­త్ మొదట బ్యా­టిం­గ్ చేసి 411 పరు­గు­లు చే­సిం­ది. అం­డ­ర్-19 ప్ర­పంచ కప్ ఫై­న­ల్‌­లో ఏ జట్టు సా­ధిం­చిన అత్య­ధిక స్కో­రు ఇది. వై­భ­వ్ సూ­ర్య­వం­శీ 80 బం­తు­ల్లో 15 ఫో­ర్లు, 15 సి­క్స­ర్ల­తో 175 పరు­గు­లు చే­శా­డు. భారీ లక్ష్య సా­ధ­న­తో బరి­లో­కి ది­గిన ఇం­గ్లాం­డ్ జట్టు 311 పరు­గు­లు మా­త్ర­మే చే­య­గ­లి­గిం­ది.

అండర్-19 ప్రపంచ కప్ విజయాల రికార్డును భారత జట్టు అధిగమించింది. అండర్-19 ప్రపంచ కప్‌ను నాలుగుసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా తర్వాత, భారత్ ఇప్పుడు ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. భారత్‌ గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. టీమిండయాను చారిత్రాత్మక విజయం దిశగా నడిపించినందున ఆయుష్ మాత్రే పేరు చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీ 

వై­భ­వ్ సూ­ర్య­వం­శీ భారత ప్ర­పంచ కప్ వి­జ­యా­ని­కి పు­నా­ది వే­శా­డు. అతను కే­వ­లం 55 బం­తు­ల్లో­నే తన సెం­చ­రీ­ని పూ­ర్తి చే­శా­డు, ఇది అం­డ­ర్-19 ప్ర­పంచ కప్ ఫై­న­ల్ చరి­త్ర­లో ఒక ఆట­గా­డు చే­సిన అత్యంత వే­గ­వం­త­మైన సెం­చ­రీ. ఆ తర్వాత అతను 71 బం­తు­ల్లో 150 పరు­గుల మా­ర్కు­ను చే­రు­కు­న్నా­డు. చి­వ­రి మ్యా­చ్‌­లో వై­భ­వ్ 80 బం­తు­ల్లో 175 పరు­గు­లు చే­య­డం మ్యా­చ్‌­లో భా­ర­త్ పై­చే­యి సా­ధిం­చేం­దు­కు అవ­కా­శం ఇచ్చిం­ది.  ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన భా­ర­త్ ని­ర్ణీత 50 ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల­కు 411 పరు­గు­లు చేసి భారీ స్కో­ర్ నమో­దు చే­సిం­ది. భారత ఇన్నిం­గ్స్‌­లో వై­భ­వ్ సూ­ర్య­వం­శీ అద్భుత సెం­చ­రీ­తో మ్యా­చ్‌­ను వన్ సైడ్ చే­సే­శా­డు. కే­వ­లం 80 బం­తు­ల్లో 175 పరు­గు­లు చేసి ఇం­గ్లాం­డ్ బౌ­ల­ర్ల­పై వి­రు­చు­కు­ప­డ్డా­డు. అతని ఇన్నిం­గ్స్‌­లో 15 ఫో­ర్లు, 15 సి­క్స­ర్లు ఉన్నా­యి. కె­ప్టె­న్ ఆయు­ష్ మత్రే 53 పరు­గు­లు, అభి­గ్యా­న్ కుం­దు 40 పరు­గు­ల­తో మంచి సహ­కా­రం అం­దిం­చా­రు. చి­వ­ర్లో కని­ష్క్ చౌ­హా­న్ వే­గం­గా 37 పరు­గు­లు చేసి స్కో­ర్‌­ను 400 దా­టిం­చా­డు.

412 పరు­గుల భారీ లక్ష్యం­తో బ్యా­టిం­గ్‌­కు ది­గిన ఇం­గ్లాం­డ్ జట్టు ప్రా­రం­భం­లో పో­రా­డి­నా.. భారత బౌ­ల­ర్ల ముం­దు ని­ల­వ­లే­క­పో­యిం­ది. కే­ల­బ్ ఫా­ల్క­న­ర్ 115 పరు­గు­ల­తో శతకం సా­ధిం­చి పో­రా­డి­నా మి­గ­తా బ్యా­ట­ర్లు పె­ద్ద­గా రా­ణిం­చ­లే­దు. చి­వ­ర­కు ఇం­గ్లాం­డ్ 40.2 ఓవ­ర్ల­లో 311 పరు­గు­ల­కు ఆలౌ­ట్ అయిం­ది. భా­ర­త్ బౌ­లిం­గ్‌­లో ఆర్‌.ఎస్‌. అం­బ్రి­ష్ 3 వి­కె­ట్లు, దీ­పే­ష్ దే­వేం­ద్ర­న్ 2 వి­కె­ట్లు, కని­ష్క్ చౌ­హా­న్ 2 వి­కె­ట్లు తీసి జట్టు­కు వి­జ­యా­న్ని అం­దిం­చా­రు. ఫై­న­ల్లో ప్లే­య­ర్‌ ఆఫ్‌ ద మ్యా­చ్‌­గా ని­లి­చిన వై­భ­వ్‌ ప్లే­య­ర్‌ ఆఫ్‌ టో­ర్నీ అవా­ర్డు­నూ గె­లు­చు­కు­న్నా­డు. ఒక ఐసీ­సీ టో­ర్నీ­లో ఈ అవా­ర్డు­లు దక్కిం­చు­కు­న్న పి­న్న వయ­స్కు­డి­గా ఘనత సా­ధిం­చా­డు. వై­భ­వ్‌ సూ­ర్య­వం­శీ స్కో­రు. ఐసీ­సీ టో­ర్నీ ఫై­న­ల్లో ఓ ప్లే­య­ర్‌ చే­సిన అత్య­ధిక స్కో­రు ఇదే.

Tags:    

Similar News