GST: ఐపీఎల్ అభిమానులకు జీఎస్టీ షాక్

క్రికెట్ అభిమానులకు కేంద్రం బిగ్ షాక్... ఐపీఎల్ టికెట్లపై 40 శాతం జీఎస్టీ.... ఐపీఎల్ మ్యాచులు చూడాలంటే జేబు గుల్లే... రూ.1000 టికెట్ ధర ఇక నుంచి రూ.1400

Update: 2025-09-05 06:30 GMT

జీ­ఎ­స్టీ­లో సమూల సం­స్క­ర­ణ­ల­కు శ్రీ­కా­రం చు­ట్టిన కేం­ద్ర ప్ర­భు­త్వం... నా­లు­గు స్లా­బ్‌­ల­ను రెం­డు స్లా­బ్‌­ల­కు కు­దిం­చిం­ది. ఇప్ప­టి­వ­ర­కు ఉన్న 12 శాతం, 28 శాతం స్లా­బు­లు ఇకపై ఉం­డ­వు. లగ్జ­రీ­కి చెం­ది­న­వ­న్నీ 40 శాతం స్లా­బు­లో­కి ప్ర­తి­పా­దిం­చిం­ది. రే­స్‌ క్ల­బ్బు­లు, లీ­జిం­గ్‌ / రెం­ట­ల్‌ సే­వ­లు, క్యా­సి­నో­లు, జూదం, గు­ర్ర­పు పం­దే­లు, లా­ట­రీ, ఆన్‌­లై­న్‌ మనీ గే­మిం­గ్‌­పై 40% పన్ను పడు­తుం­ది. ఈ జా­బి­తా­లో­కి ప్రీ­మి­యం క్రి­కె­ట్‌ సహా ఇతర స్పో­ర్టి­వ్‌ ఈవెం­ట్ల టి­కె­ట్ ధరలు చే­రా­యి. ఇక­నుం­చి ఐపీ­ఎ­ల్‌ వంటి టో­ర్నీల టి­కె­ట్ల రే­ట్లు భా­రీ­గా పె­ర­గ­ను­న్నా­యి. ఇప్ప­టి­వ­ర­కు ఇవ­న్నీ 28 శాతం పన్ను పరి­ధి­లో ఉం­డే­వి. ఇకపై అద­నం­గా మరో 12 శాతం చె­ల్లిం­చా­ల్సిన పరి­స్థి­తి. దీం­తో ఐపీ­ఎ­ల్‌ అభి­మా­ను­ల­పై భారం పడే అవ­కా­శం ఉంది.

అభిమానులకు భారం

ఐపీ­ఎ­ల్ చూ­డ­టం ఇకపై అభి­మా­నుల జే­బు­ల­కు మరింత భా­ర­మ­య్యే­లా మా­రిం­ది. సె­ప్టెం­బ­ర్ 22, 2025 నుం­చి అమ­ల్లో­కి వచ్చిన కొ­త్త జీ­ఎ­స్టీ పా­ల­సీ ప్ర­కా­రం.. ఇం­డి­య­న్ ప్రీ­మి­య­ర్ లీగ్ మ్యా­చ్‌­ల­కు, అలా­గే ఇతర ప్రీ­మి­యం స్పో­ర్ట్స్ ఈవెం­ట్స్‌­కి 40 శాతం జీ­ఎ­స్టీ వి­ధిం­చా­రు. ఇం­త­వ­ర­కు ఈ రేటు 28 శాతం మా­త్ర­మే ఉం­డే­ది. దాం­తో ఒక్క­సా­రి­గా 12 శాతం పె­రి­గిం­ది. ఇక నుం­చి ఐపీ­ఎ­ల్ టి­కె­ట్లు అత్య­ధిక ట్యా­క్స్ లి­స్టు­లో చే­రా­యి. ఇప్ప­టి­వ­ర­కు రూ.1,000 టి­కె­ట్‌­పై 28 శాతం పన్ను వే­య­డం­తో మొ­త్తం ధర రూ.1,280కి చే­రే­ది. ఇక కొ­త్త రేటు ప్ర­కా­రం అదే టి­కె­ట్‌­పై 40 శాతం పన్ను పడు­తుం­ది. దీం­తో ఆ టి­కె­ట్ ధర నే­రు­గా రూ.1,400 అవు­తుం­ది. అంటే ప్ర­తి రూ.1,000 ఖర్చు­పై అభి­మా­ను­లు అద­నం­గా రూ.120 చె­ల్లిం­చా­ల్సి వస్తుం­ది. ఐపీ­ఎ­ల్ టి­కె­ట్ ధర­ల­పై ప్ర­భా­వం ఇలా ఉం­డ­బో­తోం­ది.

పాత ధరలు.. కొత్త ధరలు ఇలా...

రూ. 500 టి­కె­ట్ - రూ. 700 (పాత ధర రూ. 640), రూ.1,000 టి­కె­ట్ -రూ.1,400 (పాత ధర రూ. 1,280), రూ.2,000 టి­కె­ట్ - రూ. 2,800 (పాత ధర రూ. 2,560). కొత్త జీఎస్టీ రేటుతో ఐపీఎల్ టికెట్లు క్యాసినోలు, రేస్‌ క్లబ్బులు, లగ్జరీ గూడ్స్‌ లిస్ట్‌లో చేరాయి. అంటే ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ చూడటం ఇప్పుడు సిగరెట్లు లేదా బెట్టింగ్ సర్వీసుల్లా ‘నాన్-ఎసెన్షియల్ ఖర్చు’ కేటగిరీలోకి వెళ్లిపోయింది.

బెట్టింగ్..జూదం, లాటరీ కూడా

బె­ట్టిం­గ్, జూదం, లా­ట­రీ, గు­ర్ర­పు పం­దెం, ఆన్‌­లై­న్ మనీ గే­మిం­గ్ వంటి కా­ర్య­క­లా­పా­ల­ను 40 శాతం పన్ను పరి­ధి­లో­కి తీ­సు­కు­రా­వా­ల­ని జీ­ఎ­స్టీ కౌ­న్సి­ల్ ని­ర్ణ­యిం­చిం­ది. ఈ ని­ర్ణ­యం ఈ రం­గాల వ్యా­పా­రా­న్ని ప్ర­భా­వి­తం చే­య­డ­మే కా­కుం­డా ప్ర­భు­త్వా­ని­కి అద­న­పు ఆదా­యం సమ­కూ­ర­ను­న్న­ది. అయి­తే, జీ­ఎ­స్టీ స్లా­బ్‌­లో మా­ర్పుల కా­ర­ణం­గా ఐపీ­ఎ­ల్‌ వంటి ఫ్రాం­చై­జ్ ఆధా­రిత ఈవెం­ట్‌­లు ఖరీ­దై­న­వి మా­ర­నుం­డ­గా.. గు­ర్తిం­పు పొం­దిన ఈవెం­ట్ల­లో పా­ల్గొ­నే ప్రే­క్ష­కు­ల­కు మా­త్రం ఉప­శ­మ­నం కలు­గ­ను­న్న­ది. ప్ర­భు­త్వ ఆదా­యా­న్ని పెం­చే ది­శ­గా ఒక కీ­ల­క­మైన అడు­గు అని ని­పు­ణు­లు భా­వి­స్తు­న్నా­రు. దీ­ర్ఘ­కా­లం­లో, ప్రే­క్ష­కుల భా­గ­స్వా­మ్యం, ఐపీ­ఎ­ల్‌­లాం­టి ఈవెం­ట్ల ప్ర­జా­ధా­ర­ణ­పై ప్ర­భా­వం కని­పి­స్తుం­ద­ని వి­శ్లే­ష­కు­లు పే­ర్కొం­టు­న్నా­రు. సాధారణ అంతర్జాతీయ లేదా దేశీయ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లపై జీఎస్టీ 18 శాతం గానే కొనసాగుతోంది. ఈ కొత్త 40 శాతం రేటు ప్రత్యేకంగా ఐపీఎల్, ఫ్రాంచైజీ లీగ్‌లను మాత్రమే ప్రభావితం చేస్తోంది.

Tags:    

Similar News