IPL: సన్‌రైజింగ్.. చెన్నై ప్యాకింగ్

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఘన విజయం... చెపాక్‌లో పుష్కరం తర్వాత చెన్నైపై విజయం;

Update: 2025-04-26 02:00 GMT

ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పంజా విసిరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ కు మరో ఓటమిని రుచి చూపించింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. చెపాక్ స్టేడియంపై 12 ఏళ్ల తర్వాత తొలిసారి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి. అలానే ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి.

చేతులెత్తేసిన చెన్నై బ్యాటర్లు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు పూర్తికాక ముందే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై జట్టు చివరి 5 ఓవర్లలో కేవలం 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో నాలుగు సిక్సర్ల సహాయంతో 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 30 పరుగులు సాధించడంతో జట్టుకు చెప్పుకోతగ్గ స్కోర్ లభించింది. హైదరాబాద్ బౌలర్లు రాణించడంతో ఓ దశలో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడేజా (21)తో కలిసి బ్రెవిస్‌ (42: 25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 74 పరుగుల వద్ద జడేజా ఔటైనప్పటికీ బ్రెవిస్‌ సిక్స్‌లతో ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. 19.5 ఓవర్లలో 154 పరుగులకే చెన్నై ఆలౌట్‌ అయింది. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. జైదేవ్ ఉనద్కట్ కూడా 2.5 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కమిందు మెండిస్, జీషాన్ అన్సారీలు కూడా తమ బౌలింగ్‌తో సీఎస్‌కే బ్యాటర్లను కట్టడి చేశారు.

ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే..

155 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ తొలి ఓవర్‌ రెండో బంతికి తొలి వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఆయుశ్‌ మాత్రేకు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ డకౌట్‌గా వినుదిరిగాడు. ఇషాన్‌ కిషన్‌ (44: 34 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌), కమిందు మెండిస్‌ (32*: 22 బంతుల్లో 3 ఫోర్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19*: 13 బంతుల్లో 2 ఫోర్లు)  రాణించారు. హెడ్‌ (19: 16 బంతుల్లో 4 ఫోర్లు) బౌల్డ్‌ అయ్యాడు. సామ్‌ కరన్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో క్లాసెన్‌, ఇషాన్‌ చెరో ఫోర్‌ బాదారు. సగం ఇన్నింగ్స్‌పూర్తయ్యే సరికి హైదరాబాద్‌ 69/3 పరుగులతో నిలిచింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీని నూర్‌ అహ్మద్‌ విడదీశాడు. అయితే కమిందు మెండిస్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆ అవకాశం ఇవ్వలేదు.

Tags:    

Similar News