Haryana Govt : నీరజ్ చోప్రాకి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా..!
Neeraj Chopra : టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి 130 కోట్లకి పైగా భారతీయుల ఆశలను నెరవేర్చిన నీరజ్ చోప్రాను చూసి ఇప్పుడు యావత్ దేశం మొత్తం గర్విస్తుంది.;
Neeraj Chopra : టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి 130 కోట్లకి పైగా భారతీయుల ఆశలను నెరవేర్చిన నీరజ్ చోప్రాను చూసి ఇప్పుడు యావత్ దేశం మొత్తం గర్విస్తుంది. దేశం గర్వపడేలా చేసిన నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ. ఆరు కోట్ల నగదుతో పాటుగా, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అటు కేంద్ర ప్రభుత్వం 75 లక్షల నజరానాను ప్రకటించింది. కాగా తన కుమారుడి ట్రైనింగ్ కష్టం చూశాక గోల్డ్ మెడల్ కచ్చితంగా వస్తుందని భావించినట్టుగా నీరజ్ తండ్రి అన్నారు. ఇక జావెలిన్ త్రో విభాగంలో ఏకంగా 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా.