hockey: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు జైత్రయాత్ర
ఆసియా కప్‌నకు అర్హత సాధించి రికార్డు;
ఆసియా కప్–2026 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... మూడో మ్యాచ్‌లోనూ 5–0 గోల్స్ తేడాతో ఇరాక్‌ను చిత్తుచేసింది. నాలుగో మ్యాచ్ లో ఉత్కంఠభరిత విజయం సాధించిన మహిళల ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగబోయే మహిళల ఫుట్‌బాల్ ఆసియా కప్‌కు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్ ద్వారా ఆసియా కప్‌నకు క్వాలిఫై అవడం భారత్‌కు ఇదే తొలిసారి. థాయిలాండ్‌లో జరిగిన క్వాలిఫయర్స్‌లో భాగంగా చివరి గ్రూపు మ్యాచ్‌లో థాయిలాండ్‌ను ఓడించడంతో టీమిండియాకు ఆసియా కప్ బెర్త్ దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో విజయం సాధించింది. సంగీత రెండు గోల్స్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. క్వాలిఫయర్స్‌లో ప్రతి గ్రూపు నుంచి టాప్‌లో ఉన్న జట్టు మాత్రమే క్వాలిఫై అవుతుంది. గ్రూపు బి నుంచి బెర్త్ భారత్‌తోపాటు థాయిలాండ్ కూడా పోటీపడింది. ఇరు జట్లకు చావోరేవో అయిన ఈ గేములో విజయం కోసం భారత్, థాయిలాండ్ నువ్వానేనా అన్నట్టు పోరాడాయి.
కానీ, టీమిండియా తన కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన థాయిలాండ్‌ను నిలువరించి ఆసియా కప్ బెర్త్ దక్కించుకుంది. క్వాలిఫయర్స్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. దీంతో గ్రూపు బిలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఆసియా కప్‌కు అర్హత సాధించింది. థాయిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్.. మంగోలియా టోమర్ లిస్టె, ఇరాక్‌లను ఓడించింది. ఆసియా కప్ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఈ విజయంతో టీమిండియాపై అంచనాలు మరింత పెరిగాయి. మహిళల ఫుట్ బాల్ క్వాలిఫయింగ్ టైటిల్ ను భారత జట్టు కైవసం చేసుకుంటే అరుదైన ఘనత సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది.