CT2025: రోహిత్ క్యాచ్ మిస్.... అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్

బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం... అక్షర్ కు క్షమాపణ చెప్పిన రోహిత్;

Update: 2025-02-21 01:30 GMT

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ జస్ట్ లో హ్యాట్రిక్ మిస్ అయింది. ముష్పికర్ రహీమ్, తన్జీద్ హసన్ ను వరుస బంతుల్లో అక్షర్ అవుట్ చేశాడు. తర్వాత జాకెర్ అలీని కూడా అవుట్ చేసినంత పని చేశాడు. జాకెర్ అలీ బ్యాట్ అంచు తాకుతూ వెళ్లిన బంతి రోహిత్ చేతుల్లో పడింది. కానీ సులువైన ఈ క్యాచ్‌‌ను రోహిత్ జారవిడిచి.. అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్ చేశాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌ను వేసిన అక్షర్ పటేల్.. రెండో బంతికే ఓపెనర్ తంజిద్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్‌ (0)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. ఇద్దరు బ్యాటర్లు ఔటైనాక బ్యాటింగ్‌కు దిగిన జకేర్‌ అలీ కూడా స్లిప్‌లో దొరికిపోయేవాడే. అక్కడే కాచుకున్న ఉన్న రోహిత్ శర్మ బంతిని అందుకొన్నట్లే కనిపించాడు. కానీ, చివరి క్షణంలో బంతి చేతి నుంచి జారిపోయింది. రోహిత్ తేలికైన క్యాచ్ వదిలేశాడు. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్‌ కూడా మిస్‌ అయిపోయింది.


క్షమాపణ చెప్పిన రోహిత్

అక్షర్ పటేల్..హ్యాట్రిక్ అందుకునే అవకాశాన్ని కోల్పోవడానికి రోహిత్ శర్మ కారణమయ్యాడు. సునాయాసమైన క్యాచును వదిలేసిన రోహిత్ శర్మ.. అక్షర్ ను హ్యాట్రిక్ కు దూరం చేశాడు. క్యాచ్ మిస్ చేసిన అనంతరం అక్షర్ పటేల్ కు.. రోహిత్ క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో వైరల్ అయింది. క్యాచ్ మిస్ అయ్యాక రోహిత్ పదేపదే నేలను కొట్టాడు.

మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు

బంగ్లాతో జరిగిన మ్యాచులో భారత పేసర్ షమీ.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో షమీ మూడో వికెట్ సాధించగా.. వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ రికార్డును షమీ బద్దలు కొట్టాడు. షమీ 5126 బంతుల్లో 200 వికెట్లు సాధించగా.. స్టార్క్ 5240 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.

తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే

మహమ్మద్ షమీ 5126 బంతుల్లో 200 వికెట్లు

మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో 200 వికెట్లు

సక్లైన్ ముష్తాక్ 5451 బంతుల్లో 200 వికెట్లు

బ్రెట్ లీ 5640 బంతుల్లో 200 వికెట్లు (AUS)

ట్రెంట్ బౌల్ట్ 5783 బంతుల్లో 200 వికెట్లు

వకార్ యూనిస్ 5883 బంతుల్లో 200 వికెట్లు

Tags:    

Similar News