ICC: పాక్ పై కఠిన చర్యలకు ఐసీసీ సిద్ధం..!

భారత్‌ మ్యాచును బహిష్కరించిన పాక్... పాక్ జట్టు నిర్ణయంపై ఐసీసీ ఆగ్రహం... మళ్లీ సంక్షోభంలోకి దాయాది జట్టు ##

Update: 2026-02-03 03:30 GMT

టీ20 వర­ల్డ్‌­క­ప్‌ 2026లో గ్రూ­ప్‌ స్టే­జి­లో భా­ర­త్‌­తో మ్యా­చ్‌­ను బహి­ష్క­రిం­చా­ల­ని తమ క్రి­కె­ట్‌ జట్టు­ను ఆదే­శిం­చిన పా­కి­స్థా­న్‌ ప్ర­భు­త్వ ని­ర్ణ­యం­పై ఐసీ­సీ తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం­చే­సిం­ది. ఈ చర్య ప్ర­పంచ క్రీ­డా ని­య­మా­ల­కు వి­రు­ద్ధ­మ­ని ఓ ప్ర­క­ట­న­లో పే­ర్కొం­ది. పా­కి­స్థా­న్‌ ప్ర­భు­త్వ ని­ర్ణ­యం తమ దృ­ష్టి­కి వచ్చి­న­ప్ప­టి­కీ, పా­కి­స్థా­న్‌ క్రి­కె­ట్‌ బో­ర్డ్‌ నుం­చి అధి­కా­రిక సమా­చా­రం కోసం ఇంకా ఎదు­రు­చూ­స్తు­న్న­ట్లు ఐసీ­సీ తె­లి­పిం­ది. టో­ర్న­మెం­ట్‌­లో ఎం­పిక చే­సిన మ్యా­చు­ల్లో మా­త్ర­మే పా­ల్గొ­న­డం అనే వారి వై­ఖ­రి ఆమో­ద­యో­గ్యం కా­ద­ని ఐసీ­సీ తన అసం­తృ­ప్తి­ని వ్య­క్తం­చే­సిం­ది. జా­తీయ వి­ధా­నా­ల­కు సం­బం­ధిం­చిన వి­ష­యా­ల్లో ప్ర­భు­త్వాల పా­త్ర­ను గు­ర్తిం­చి, గౌ­ర­వి­స్తు­న్న­ప్ప­టి­కీ.. ఈ ని­ర్ణ­యం సరైం­ది కా­ద­ని ఐసీ­సీ అభి­ప్రా­యం వ్య­క్తం­చే­సిం­ది. అలా­గే ఇది ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ఉన్న క్రి­కె­ట్‌ ఫ్యా­న్స్‌, పా­కి­స్థా­న్‌­లో­ని లక్ష­లా­ది మంది అభి­మా­ను­ల­కు మం­చి­ది కా­దం­ది. పా­క్‌ ని­ర్ణ­యం.. ఆ దే­శం­లో­ని క్రి­కె­ట్‌­పై చూపే దీ­ర్ఘ­కా­లిక ప్ర­భా­వా­ల­ను జా­గ్ర­త్త­గా పరి­శీ­లిం­చా­ల­ని పీ­సీ­బీ­ని .. ఐసీ­సీ కో­రిం­ది.

ఇందుకు అను­మ­తి ఇవ్వ­డం తీ­వ్ర వి­వా­దా­ని­కి దారి తీ­స్తోం­ది. ఈ ని­ర్ణ­యా­న్ని బం­గ్లా­దే­శ్‌­కు సం­ఘీ­భా­వం­గా తీ­సు­కు­న్న చర్య­గా పా­కి­స్థా­న్ ప్ర­భు­త్వం సమ­ర్థిం­చు­కుం­టు­న్నా.. లో­తు­గా పరి­శీ­లి­స్తే ఇం­దు­లో స్ప­ష్ట­మైన ద్వం­ద్వ ప్ర­మా­ణా­లు కని­పి­స్తు­న్నా­య­ని వి­మ­ర్శ­లు వె­ల్లు­వె­త్తు­తు­న్నా­యి. బం­గ్లా­దే­శ్ మ్యా­చ్‌­ల­ను భా­ర­త్ నుం­చి శ్రీ­లం­క­కు మా­ర్చేం­దు­కు ఐసీ­సీ ని­రా­క­రిం­చ­డా­న్ని పా­కి­స్థా­న్ వ్య­తి­రే­కి­స్తోం­ది అని ఆ దేశ పా­కి­స్థా­న్ మీ­డి­యా కథ­నా­లు ప్ర­కా­రం చే­సిం­ది. గతం­లో ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ, మహి­ళల వన్డే వర­ల్డ్‌ కప్‌­ల­కు హై­బ్రి­డ్ మో­డ­ల్‌­ను అను­స­రిం­చిన ఐసీ­సీ, ఇప్పు­డు “పక్ష­పాత ని­ర్ణ­యా­లు” తీ­సు­కుం­టోం­ద­ని పాక్ ఆరో­పి­స్తోం­ది.

జిత్తులమారి పాక్

భా­ర­త్‌­తో మ్యా­చ్‌­ను మా­త్ర­మే బహి­ష్క­రిం­చి, మి­గ­తా అన్ని మ్యా­చ్‌­ల­లో పా­ల్గొ­న­డం ద్వా­రా ఐసీ­సీ నుం­చి వచ్చే ఆదా­యా­న్ని పీ­సీ­బీ అం­దు­కుం­టూ­నే ఉంది. అదే ఐసీ­సీ­ని పక్ష­పాత సం­స్థ­గా వి­మ­ర్శి­స్తూ, దాని ప్ర­యో­జ­నా­ల­ను ఆస్వా­దిం­చ­డం స్ప­ష్ట­మైన వి­రు­ద్ధ­త­గా కని­పి­స్తోం­ది. ఇక, భా­ర­త్ పా­కి­స్థా­న్‌­కు వె­ళ్లి ఆడేం­దు­కు ని­రా­క­రిం­చ­డం­పై పాక్ గతం­లో ఎన్నో సా­ర్లు ని­ర­స­న­లు తె­లి­పిం­ది. అయి­న­ప్ప­టి­కీ, భారీ గ్లో­బ­ల్ వీ­క్ష­కు­లు, భారీ ఆదా­యం దృ­ష్ట్యా ఐసీ­సీ టో­ర్నీ­ల్లో భా­ర­త్‌­తో ఆడేం­దు­కు మా­త్రం ఎప్పు­డూ సి­ద్ధం­గా­నే ఉంది. అలాం­టి­ది, ఇప్పు­డు అక­స్మా­త్తు­గా భా­ర­త్‌­తో ఒక్క మ్యా­చ్‌­ను మా­త్ర­మే బహి­ష్క­రిం­చి బం­గ్లా­దే­శ్‌­కు మద్ద­తు తె­లి­పి­తే, రా­జ­కీయ లబ్ధి కోసం వే­సిన ఎత్తు­గ­డ­గా కని­పి­స్తోం­దా అని పాక్ కి చెం­దిన కొం­ద­రు వి­మ­ర్శ­కు­లు గు­ప్పి­స్తు­న్నా­రు. ఇక, ఒకే టో­ర్నీ­లో ఒక కీలక మ్యా­చ్‌­ను మా­త్ర­మే వది­లే­య­డం క్రీ­డా స్ఫూ­ర్తి­కి వి­రు­ద్ధం.. ని­జం­గా ‘న్యాయ సూ­త్రాల’ కోసం బహి­ష్క­రణ అను­కుం­టే, మొ­త్తం ఈవెం­ట్ నుం­చే తప్పు­కో­వా­ల్సి ఉం­టుం­ది.. కానీ అలా చే­య­కుం­డా, టో­ర్నీ­కి అతి­పె­ద్ద ఆదా­యా­న్ని తె­చ్చే భా­ర­త్- పా­కి­స్థా­న్ మ్యా­చ్‌­ను మా­త్ర­మే అడ్డు­కో­వ­డం.. అదే సమ­యం­లో ఆర్థిక శి­క్ష­లు లేదా క్రీ­డా ఒం­ట­రి­త­నం నుం­చి తప్పిం­చు­కో­వ­డం కో­స­మే ఇలా పా­కి­స్తా­న్ చే­సిం­ద­ని క్రీ­డా వి­శ్లే­ష­కు­లు పే­ర్కొం­టు­న్నా­రు. పాక్ ఆరో­ప­ణ­ల­పై ఐసీ­సీ తా­జా­గా స్పం­దిం­చిం­ది.. భా­ర­త్ తో మ్యా­చ్ ఆడేం­దు­కు దా­యా­ది దేశం పు­న­రా­లో­చన చే­యా­ల­ని కో­రిం­ది. రా­జ­కీయ కా­ర­ణా­ల­తో జట్లు తమకు నచ్చిన ప్ర­త్య­ర్థు­ల­ను ఎం­చు­కు­ని బహి­ష్క­రి­స్తే, వర­ల్డ్‌­క­ప్ ని­ర్మా­ణం, వి­శ్వ­స­నీ­యత పూ­ర్తి­గా దె­బ్బ­తిం­టుం­ద­ని ఐసీ­సీ పే­ర్కొం­ది.

Tags:    

Similar News