T20WorldCup 2021: ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్.. గ్రూపుల వివరాలు ఇవే
T20WorldCup 2021: టీ20 ప్రపంచకప్ సంబంధించిన గ్రూప్స్‌ను ఐసీసీ ప్రకటించింది. భారత్-పాక్ జట్లు ఒకే గ్రూపులో ఉండడంతో క్రికెట్ అభిమానులకు మజా అందించనుంది.;
T20WorldCup 2021
T20 WorldCup 2021: ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ గ్రూపులను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాక్‌లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు బరిలో నిలిచాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈలో వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తుది షెడ్యూల్‌ను ఐసీసీ మరికొన్ని వారాల్లో ప్రకటించనుంది.ఈ పోటీలను బీసీసీఐ యూఏఈ, ఒమన్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
*ఇక టీ20 క్రికెట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న వెస్టిండీస్.. గ్రూప్-1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పోటీపనున్నాయి.
*గ్రూప్-2లో భారత్.. పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లతో తలపడనుంది.
*ఈ క్రమంలోనే శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు గ్రూప్-ఏలో ఉండగా..
*బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువాన్యూగినియా, ఓమన్ జట్లు గ్రూప్-బీలో చోటు సంపాదించుకున్నాయి.
*ఈ ఎనిమిది జట్లలో టాప్‌లో నిలిచిన నాలుగు గ్రూప్-1, గ్రూప్-2లో చివరిస్థానాల్లో నిలుస్తాయి.