TEAM INDIA: వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్
మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం... సెంచరీతో కదం తొక్కిన గిల్;
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి, నామమాత్రపు వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే రెండు వన్డేల్లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించి... వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (112) సెంచరీతో కదం తొక్కాడు. ఆదిల్ రషీద్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఛేదనలో బ్రిటీష్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. టామ్ బాంటన్, గస్ అట్కిన్సన్ చెరో 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ తోనే జరిగిన టీ20 సిరీస్ ను కూడా 4-1తో భారత జట్టు గెలుచుకుంది. ఈ సిరీస్ విజయంతో వచ్చేవారం ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆత్మ విశ్వాసంతో భారత్ సిద్ధం కానుంది.
సెంచరీతో చెలరేగిన గిల్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో గిల్ (112)సెంచరీతో చెలరేగగా.. శ్రేయాస్ అయ్యర్ 78, కోహ్లీ 52, కేఎల్ రాహుల్ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4, వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.
గిల్ అరుదైన రికార్డు
టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. 50 ఇన్నింగ్స్‌లో గిల్ ఈ అరుదైన మైలురాయిని సాధించడం విశేషం. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో గిల్ ఈ రికార్డు సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం గిల్ 81 బంతుల్లో 87* పరుగులు పూర్తి చేసుకున్నారు.
చరిత్ర సృష్టించిన కోహ్లీ
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సాధించారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఈ రికార్డు అందుకున్నారు. ఇక ఓవరాల్‌గా కోహ్లీ ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌పై (వన్డేలు, టీ20లు, టెస్టులు) 87 మ్యాచ్‌లు ఆడి 4వేల రన్స్ పూర్తి చేసుకున్నారు.