IND vs ENG: 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒకే ఒక్కడు
టీమిండియా సారధి శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర;
టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో రికార్డు నమోదు చేశాడు. సంచలనాన్ని అందుకున్నాడు. 148 ఏళ్ల టెస్టు చరిత్రలో మరే బ్యాటర్ కు దక్కని రికార్డును సొంతం చేసుకున్నాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒకే టెస్టులో 250, 150కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు సాధించాడు. 1971లో సునీల్ గవాస్కర్ నెలకొల్పిన రికార్డును 54 ఏళ్ల తర్వాత గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ పూర్తి చేసుకుని జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. ఈ ఘనత సాధించిన భారత కెప్టెన్లలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీల తర్వాత మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
గవాస్కర్ రికార్డు బద్దలు
గవాస్కర్ రికార్డును అధిగమించి, ఇంగ్లాండ్‌లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 500 పరుగులు పూర్తి చేసిన గిల్.. మిగతా మూడు టెస్టుల్లో ఎలా రాణిస్తాడో చూడాలి. టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 344 పరుగులు చేశాడు. ఈ యాభై ఏళ్లలో ఈ రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా ఆటగాడు లేనే లేడు. వీవీఎస్ లక్ష్మణ్ గవాస్కర్ దగ్గరకు వచ్చిన 344 పరుగులకు పైగా చేయలేకపోయాడు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వీవీఎస్ 340 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 2007లో పాకిస్తాన్‌పై 330 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒకే టెస్టులో 350 పరుగులు చేసిన ఆటగాడు శుభమన్ గిల్ ఒక్కడే.
ఒకే ఒక్కడు
భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూనే ఉన్నాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో హండ్రెడ్ బాదాడు. ఓ టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ స్కోర్లు చేసిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. అంతే కాకుండా ఓ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో గిల్ 430 రన్స్ చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఓ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. గూచ్ (1990లో ఇండియాపై 456) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంగ్లండ్ - ఇండియా ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టుకే శుభమన్ గిల్ 500కు పైగా పరుగులు సాధించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఏకైక కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసిన గిల్.. టీమిండియా బ్యాటర్లలో ఇంగ్లండ్‌పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు.