IND vs PAK: పాక్ కూడా అదే కోరుకుంటుంది...

అభిషేక్ శర్మపైనే అందరి కళ్లు

Update: 2026-02-15 05:45 GMT

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్, పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైనా అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ.. అభిషేక్ మంచి ప్లేయర్.. పూర్తిగా కోలుకుని ఆడితే బాగుంటుంది, మేం అత్యుత్తమ జట్టుతోనే ఆడాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

" టీమ్‌ఇండియాకు ఆ సత్తా ఉంది"

పొ­ట్టి ప్ర­పం­చ­క­ప్‌­లో భా­గం­గా.. ఆది­వా­రం భా­ర­త్‌, పా­కి­స్థా­న్‌ జట్ల మధ్య హై­వో­ల్టే­జ్‌ మ్యా­చ్‌ జర­గ­నుం­ది. ఈ పో­రు­లో భా­ర­త్‌ వి­జ­య­కే­త­నం ఎగు­ర­వే­స్తుం­ద­ని టీ­మ్ఇం­డి­యా మాజీ క్రి­కె­ట­ర్‌ హర్భ­జ­న్‌­సిం­గ్‌ అన్నా­డు. రాం­చీ­లో అతడు వి­లే­క­రు­ల­తో మా­ట్లా­డు­తూ ఈ వ్యా­ఖ్య­లు చే­శా­డు. ‘భా­ర­త్‌ మ్యా­చ్‌­ను కచ్చి­తం­గా గె­లు­స్తుం­ది. పా­కి­స్థా­న్‌ స్పి­న్న­ర్‌ ఉస్మా­న్‌ తా­రి­క్‌­ను భారత బ్యా­ట­ర్లు సమ­ర్థం­గా ఎదు­ర్కొం­టా­రు. టీ­మ్ఇం­డి­యా­కు ఆ సత్తా ఉంది. భా­ర­త్‌ చాలా మంచి జట్టు. ని­త్యం ఆడు­తు­న్న­ట్లే వారూ ఈ మ్యా­చ్‌­నూ ఆడ­తా­రు. ఒత్తి­డి లే­కుం­డా మె­రు­గైన ప్ర­ద­ర్శన చేసి.. విజయ కే­త­నం ఎగుర వే­స్తా­రు’ అని హర్భ­జ­న్‌ సిం­గ్‌ అన్నా­డు. ప్ర­స్తు­తం పా­కి­స్థా­న్‌ మీదే తీ­వ్ర­మైన ఒత్తి­డి ఉం­ద­ని, ఈ మ్యా­చ్ కచ్చి­తం­గా భా­ర­త్‌ గె­లు­స్తుం­ద­ని టీ­మ్‌­ఇం­డి­యా మరో మాజీ క్రి­కె­ట­ర్‌ నయ­న్‌ మోం­గి­యా అన్నా­డు. ‘ఈ మ్యా­చ్‌­లో కచ్చి­తం­గా భా­ర­త్‌ వి­జ­యం సా­ధి­స్తుం­ది. భా­ర­త్‌ బ్యా­టిం­గ్‌, బౌ­లిం­గ్‌ చూసి ఆ వి­ష­యం చె­ప్పొ­చ్చు. పా­కి­స్థా­న్‌ ఐసీ­సీ ( టో­ర్న­మెం­ట్ల­లో ఏడు లేదా ఎని­మి­ది మ్యా­చు­ల్లో వరు­స­గా ఓడి­పో­యిం­ది. నాకు తె­లి­సి భా­ర­త్‌­కు మరో­సా­రి పా­క్‌­ను ఓడిం­చ­డం అం­త­క­ష్టం కాదు. పా­కి­స్థా­న్‌ మీదే చాలా ఒత్తి­డి ఉంది.

మ్యాచ్‌కు వర్షం గండం....?

టీ20 వర­ల్డ్ కప్ లో భా­గం­గా భా­ర­త్, పా­కి­స్తా­న్ మధ్య మ్యా­చ్ కు తీ­వ్ర అం­త­రా­యం ఏర్ప­డే ప్ర­మా­దం పొం­చి ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఫి­బ్ర­వ­రి 15వ తే­దీన కొ­లం­బో­లో వర్ష పాతం ఉండే ఛా­న్సు­లు ఉన్న­ట్లు హె­చ్చ­రి­క­లు జారీ చే­సిం­ది వా­తా­వ­రణ శాఖ 70 నుం­చి 85% వరకు కొ­లం­బో­లో వర్ష పాతం ఉన్న­ట్లు స్ప­ష్ట­మ­వు­తోం­ది. అంటే కచ్చి­తం­గా ఇం­డి­యా­తో జరి­గే పాక్ మ్యా­చ్ సం­ద­ర్భం­గా వర్షం పడే ప్ర­మా­ద­మే ఉంది. ఒక­వేళ వర్షం పడి మ్యా­చ్ ఆగి­పో­తే చెరో పా­యిం­ట్ ఇస్తా­రు. లేదా రెం­డు జట్లు మ్యా­చ్ ఆడా­ల్సిం­దే. అయి­తే ఈ మ్యా­చ్ కు వర్షం వి­ల­న్ గా మారే ప్ర­మా­దం ఉన్న నే­ప­థ్యం­లో అభి­మా­ను­లు టె­న్ష­న్ పడు­తు­న్నా­రు. ఎన్నో రో­జు­లు­గా వేచి చూ­స్తు­న్న ఈ ఫైట్ కు వర్షం అం­త­రా­యం కలి­గిం­చ­కూ­డ­ద­ని కో­రు­తు­న్నా­రు. అయి­తే, వ‌­ర్షం ప‌డి మ్యా­చ్ ర‌­ద్దు అయి­తే, కో­ట్ల­‌­ల్లో న‌­ష్టం జ‌­రి­గే ప్ర­‌­మా­దం ఉంది. టీ20 ప్ర­పంచ కప్ లో భా­గం­గా భా­ర­త్, పా­కి­స్తా­న్ మ్యా­చ్ నేడు జర­గ­నుం­ది. ఈ నే­ప­థ్యం­లో కొ­లం­బో­కు చే­రు­కుం­ది భారత జట్టు. మొ­న్న నమీ­బి­యా­తో ఢి­ల్లీ వే­ది­క­గా మ్యా­చ్ ఆడిం­ది భా­ర­త్. ఈ మ్యా­చ్ లో వి­జ­యం సా­ధిం­చిన భా­ర­త్, ఆది­వా­రం మరో భయం­క­ర­మైన ఫైట్ కోసం సి­ద్ధ­మైం­ది. క టీ20 వర­ల్డ్ కప్ లో భా­గం­గా భా­ర­త్, పా­కి­స్తా­న్ మధ్య మ్యా­చ్ లో అభి­షే­క్ శ‌­ర్మ ఆడనున్నాడు.

Tags:    

Similar News