ఆసియాకప్ 2025లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసిన టీమిండియా.. రెట్టించిన ఉత్సాహంతో దాయాదితో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే తొలి మ్యాచ్‌తో పోలిస్తే.. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అర్షదీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జితేశ్ శర్మ కోసం సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. అర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తే ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ దొరకకపోవచ్చు. యూఏఈతో మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడికి చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఫిక్స్ అయ్యారు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు వస్తారు. దీంతో జట్టులోకి స్పెషలిస్ట్ ఫినిషర్‌ను తీసుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకే ఐపీఎల్లో ఫినిషర్ రోల్‌ను సమర్థవంతంగా పోషించిన జితేశ్ శర్మను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్ బెంచ్‌పై కూర్చునే అవకాశం ఉంది.
ఆసియా కప్‌లో భారత్ - పాక్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సవాల్ విసరడంతో మరింత వేడి రాజుకుంది. భారత్ - పాక్ పోరు సమీపిస్తున్న నేపథ్యంలో దేశీయంగా మరో వివాదం చెలరేగింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగకూడదని కొందరు పౌరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినా, కోర్టు దానిని తిరస్కరించింది. భారత్ ఐసీసీ, ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో మాత్రమే పాకిస్తాన్‌తో ఆడవచ్చు,
తొలిసారి బరిలోకి...
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఐదుగురు యువ ఆటగాళ్లు ఉన్నారు. వీరు పాకిస్తాన్‌తో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ కీలక మ్యాచ్‌లో వారికి పాకిస్తాన్‌తో తలపడే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది.
2012-13 నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ కారణం వల్ల భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. ఈ ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, జితేష్ శర్మ ఉన్నారు. వీరితో పాటు యువ సంచలనాలు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా పాకిస్తాన్‌తో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ మ్యాచులో వీరు సత్తా చాటాలని చూస్తున్నారు.